Share News

CM Revanth: నా కుటుంబంలో ఎవరూ పోటీ చేయట్లేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 05 , 2024 | 07:35 PM

పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరు సొదరులు మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ స్పందించారు. తన కుటుంబంలో ఎవరూ ఎంపీగా పోటీ చేయరని స్పష్టం చేశారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు.

CM Revanth: నా కుటుంబంలో ఎవరూ పోటీ చేయట్లేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరు సొదరులు మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ స్పందించారు. తన కుటుంబంలో ఎవరూ ఎంపీగా పోటీ చేయరని స్పష్టం చేశారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా మాజీ సీఎం కేసీఆర్ చేశారని మండిపడ్డారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారని నిలదీశారు. దేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దన్న అవుతారన్నారు. కేసీఆర్ పాలనలో వందేళ్ల విధ్వంసం చేస్తే..వంద రోజుల్లో తమ ప్రభుత్వం పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన మిత్రుడేనని.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే ఏమి కాదన్నారు. తమ ప్రభుత్వ పరిపాలన రిఫరెండంగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.14కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుందని చెప్పారు.

కాళేశ్వరంపై ఫైనల్‌గా ఎన్డీఎస్ఏ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగిందని అన్నారు. జీఏస్టీ రూ.500 కోట్ల ఆదాయం పెరిగిందని చెప్పారు.ఎల్ఆర్ఎస్‌పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్‌పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుందని.. రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్యాక్స్ పేయర్స్‌కు రైతు బంధు ఎందుకు.. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు కావాలని అన్నారు. రైతుబంధుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతామని చెప్పారు. ఎస్ఐబీ డీఎస్సీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 08:42 PM