Share News

CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:28 PM

ప్రతిపక్షాల మాటలను నమ్మొదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం బకాయి పెట్టిన రైతుబంధును తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ.7,625కోట్ల రైతుబంధు నిధులు చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy:  రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్: రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రైతు భరోసాను కొనసాగిస్తామని అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు వేస్తామని తెలిపారు. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. మారీచుల మాయ మాటలు రైతులు నమ్మొద్దని చెప్పారు. వరికి రూ.500 బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పులమయంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

ఈ ఏడాది కాలంలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు. అసెంబ్లీలో విధి విధానాల పై చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. సన్నాలకు రూ. 500బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులామని విమర్శించారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై చర్చిద్దాం రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.


తెలంగాణను అప్పుల్లో ముంచారు...

Revanth-Reddy-1.jpgరాష్ట్రంపై రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. ప్రతినెలా రూ. 6500 కోట్లు వడ్డీకే కట్టాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాదిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి గతంలో ఎవరూ బయటపెట్టలేదని చెప్పారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొదని అన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అధైర్యపడకుండా అమలు చేస్తామని అన్నారు. రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.2023 వానాకాలంలో రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతులు సన్న వడ్లు పండించాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.తాము అధికారంలోకి రాగానే రూ. రూ. 7625 కోట్లు రైతుబంధు నిధులు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.


రైతు భరోసాను కొనసాగిస్తాం..

‘‘రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది కాంగ్రెస్ ఒక్కటే. నెహ్రూ నుంచి వైఎస్సార్ దాకా రైతులే మా ఎజెండా. కేసీఆర్ బకాయి పెట్టిన రైతుబంధును మేం చెల్లించాం. అధికారంలోకి రాగానే రూ.7,625కోట్ల రైతుబంధు నిధులు చెల్లించాం. ఆగస్టు 15నాటికి 22.22లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్టు 15నాటికి రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమచేశాం. నిన్న 3.14లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ2,747కోట్లు వేశాం. ఇప్పటివరకు 25.35 లక్షలమంది రైతుల ఖాతాల్లో.. రూ.21వేల కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ రైతులను మోసం చేసింది. రైతు భరోసాను కొనసాగిస్తాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తాం. మారీచుల మాయ మాటలు రైతులు నమ్మొద్దు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

KISHAN REDDY: ఏడాది గడువు ఇచ్చాం.. అయినా ఇలా చేస్తే ఎలా.. సీఎం రేవంత్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

Hyderabad: సన్నీ లియోన్ కోసం ఆశగా ఎదురు చూసిన యువకులు.. చివరికి జరిగింది ఇదే..

Jishnu Dev Varma: యువత దేశాభివృద్ధిలో భాగం కావాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 01 , 2024 | 05:17 PM