Share News

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలు ప్రయారిటీ

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:57 PM

జిల్లాలో ఉన్న వ‌న‌రుల ఆధారంగా ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి కలెక్టర్ రూప‌కల్పన చేసి అమ‌లు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలు ప్రయారిటీ
CM Revanth Reddy

హైద‌రాబాద్‌: జిల్లాలో ఉన్న వ‌న‌రుల ఆధారంగా ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి కలెక్టర్ రూప‌కల్పన చేసి అమ‌లు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.


‘అట‌వీ భూముల్లో పండ్ల మొక్కలు నాట‌డంతో గిరిజ‌నుల‌కు ఆదాయం, ప‌చ్చదనం పెంపొందుతుంది . గిరిజ‌నుల‌కు ఆదాయం లేక‌ పోడు వ్యవసాయంపై ఆధార‌ప‌డ్డారు. ప‌ట్టాలు ఇచ్చిన భూముల్లో మామిడి, సీతాఫ‌లం, జామ వంటి పండ్ల మొక్కలు నాటితే సీజ‌న్ల వారీగా పండ్ల ద్వారా ఆ కుటుంబాల‌కు ఆదాయం సమకూరుతుంది. నాలుగేళ్లలో పంట వ‌చ్చే హైబ్రిడ్ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అట‌వీ ప్రాంతాల్లో ఎక‌రాల కొద్ది ఖాళీ స్థలం ఉంద‌ని, డ్రోన్ల ద్వారా ఏరియ‌ల్ స‌ర్వే చేయించండి. భూసార ప‌రీక్షలు చేయించి, ఆ నేలల్లో పెరిగే పండ్ల మొక్కలు నాటించాలి. దాంతో కోతుల స‌మ‌స్యకు కొంత వరకు ప‌రిష్కారం ల‌భిస్తుంది. పులుల స‌ఫారీకి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప‌ర్యాట‌కులు మ‌హారాష్ట్రలో గల త‌డోబా అట‌వీ ప్రాంతానికి వెళుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అట‌వీ ప్రాంతం ఉన్నా, పులులు సంచారం లేదు. వాటికి అవ‌సర‌మైన ఆవాసం, నీటి సౌక‌ర్యం క‌ల్పిస్తే అట‌వీ ప‌ర్యాట‌కం పెంపొందించ‌వచ్చు. వన మహోత్సంలో మనం నాటే మొక్కలు 50 ఏళ్ల పాటు ఫల సాయం అందించేలా ఉండాలి. కలెక్టర్లు నెలకోసారి అటవీ ప్రాంతాల్లో పర్యటించాలి. గతంలో ప్రభుత్వ భూమి లభ్యత లేనందున ప్రాజెక్టు కట్టలు, కాలువ కట్టలు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలని, మూడునాలుగేళ్లలో గీత వృత్తిదారులకు ఆదాయం వచ్చేలా హైబ్రిడ్ మొక్కలు నాటాలి అని’ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.


‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో స్కూల్స్ ఏర్పాటు చేస్తాం, నియోజకవర్గంలో రహదారులకు అనుసంధానంగా ఉండే గ్రామాలు, పట్టణాల్లో వాటికి స్థలాల ఎంపిక చేయాలి. రాష్ట్రంలో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్ గ్రేడ్ చేస్తున్నాం. కలెక్టర్లు తమ పరిధిలోని ఐటీఐలను సందర్శించి వాటిని ఏటీసీలుగా మార్చే ప్రక్రియ ఎలా సాగుతుందో పరిశీలించాలి. అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నందున ప్రస్తుతం ఉన్న ఐటీఐల్లో స్థలం సరిపోక పోతే ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేసుకోవాలి. విద్యారంగానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో బడుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలని, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేసేలా చూడాలి. కలెక్టర్లు పాఠశాలలు తనిఖీ చేసిన తర్వాత అక్కడ సమస్యలు పరిష్కారం కావాలని, లేకుంటే ఆ తనిఖీలకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. మధ్యాహ్న భోజనం మరింత మెరుగ్గా అందించేందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్ వంటి సంస్థల సహకారం తీసుకునే అంశంపై అధ్యయనం చేయాలి అని’ విద్యా శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలి. పబ్బులు విషయంలో టైమింగ్ పెట్టొచ్చు, ఆంక్షల పేరుతో రాత్రి వేళ్లల్లో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు సూచన. ఐటీ రంగంలో వారు రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూ చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు, ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. డ్రగ్స్ విషయంలో పోలీసు, ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. డ్రగ్స్ కేసుల్లో విదేశీయులు పట్టుపడుతున్నారని, వారు ఏ పని మీద రాష్ట్రానికి వస్తున్నారు. ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి సారించాలి. డ్రగ్స్‌తో పట్టుపడిన వారిని డీఅడిక్షన్ సెంటర్లలో ఉంచాలి, ఇందుకోసం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలి అని’ సీఎం రేవంత్ సూచించారు.

Updated Date - Jul 16 , 2024 | 09:57 PM