CM Revanth Reddy: క్యాన్సర్ బాధిత బాలుడికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Jul 01 , 2024 | 07:51 PM
వరంగల్ పర్యటనకు వెళ్లిన తనను కలవలేకపోయిన క్యాన్సర్(Cancer) బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్(Mohammed Adil Ahmed) విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు.
హైదరాబాద్: వరంగల్ పర్యటనకు వెళ్లిన తనను కలవలేకపోయిన క్యాన్సర్ (Cancer) బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్ (Mohammed Adil Ahmed) విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు. జూన్ 29న వరంగల్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లగా.. ఆయణ్ను కలిసేందుకు వచ్చిన బాలుడి కుటుంబాన్ని భద్రతా సిబ్బంది ఆపేశారు. విషయం తెలుసుకున్న సీఎం బాలుణ్ని ఆదుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఓఎస్డీ వేముల శ్రీనివాస్ బాలుడి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. నెల రోజుల క్రితం అదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేసింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై వేముల శ్రీనివాస్ ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా మరింత సాయం అందిస్తామని అదిల్ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి:
TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..