Share News

CM Revanth: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

ABN , Publish Date - Feb 21 , 2024 | 10:26 AM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (బుధవారం) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొండగల్‌ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు.

CM Revanth: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొండగల్‌ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. కొడంగల్‌లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేస్తారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్‌లో కోస్గి చేరుకోనున్న సీఎం రేవంత్.. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2024 | 10:26 AM