Share News

CM Revanth: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:52 PM

Telangana: ‘‘కొడంగల్‌లో కంపెనీలు పెట్టొద్దా, ఉద్యోగాలు ఇవ్వవద్దా, మెడికల్ చదువులు వద్దా. అభివృద్ధికి అడ్డుపడితే తొక్కుకుంటూ పోతా అని అందుకే అంటున్నా. అన్నీ వద్దు అన్నాక అభివృద్ధి పథంలో నడిపించడం ఎట్లా సాధ్యం అవుతుంది. దొంగలకు సద్దులు మోస్తున్నారు.’’ అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు.

CM Revanth: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్
Telangana Assembly

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ‘‘కొడంగల్ ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే. స్వాతంత్ర్యం వచ్చాక కొడంగల్ నుంచి ఒక్కరూ మంత్రి కాలేదు. నాకు సీఎంగా అవకాశం వచ్చింది. కొడంగల్ నియోజకవర్గంలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నేను అనుకోవడం తప్పా. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ముచ్చర్లలో ఫార్మా సిటీ పెట్టడం తప్పు కాదు. సాగు, త్రాగు నీరు లేని చోట భూములు తీసుకుంటే తప్పా. నాలుగు గ్రామాల్లో భూసేకరణ చేసి కంపెనీలు తేవాలని అనుకున్నా. కోట్ల రూపాయలు పంపించి, మందు తాగించి దాడులు చేయించారు. అధికారులు వెళ్తే రాళ్లు, రప్పలతో దాడులు చేయించారు. కొడంగల్‌లో కంపెనీలు పెట్టొద్దా, ఉద్యోగాలు ఇవ్వవద్దా, మెడికల్ చదువులు వద్దా. అభివృద్ధికి అడ్డుపడితే తొక్కుకుంటూ పోతా అని అందుకే అంటున్నా. అన్నీ వద్దు అన్నాక అభివృద్ధి పథంలో నడిపించడం ఎట్లా సాధ్యం అవుతుంది. దొంగలకు సద్దులు మోస్తున్నారు. నల్లమల అడవుల నుంచి కూరమృగాల మధ్య నుంచి వచ్చాను. గుంటూరు విజ్ఞాన్‌లో చదువుకుని రాలేదు. సామాన్యుడిగా వచ్చాను. అయ్య పేరు చెప్పుకుని రాలేదు. ఎమ్మెల్యేలను ఒత్తిడి చేసి సియోల్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పంపించలేదు. కాళ్లల్లో కట్టె పెట్టి అడ్డంపడుతున్నారు’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Allu Arjun Case: అల్లు అర్జున్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్..


కేసీఆర్ ట్రైనింగ్ ఇదేనా..

నల్గొండ జిల్లా ఏం పాపం చేసిందని.. ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లాలో కాళ్ళు, చేతులు వంకర పోయాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీని పదేళ్లు పడుకోబెట్టారని విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళన చేయవద్దా అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా. విధ్వంసం చేయాలని చూసినా, బరితెగించినా క్రూరమృగాలను బంధించినట్లు ఎలా బంధించాలో ప్రభుత్వానికి తెలుసు. 21 ఏళ్ళు అనుభవం ఉందని స్పీకర్ పై దాడికి వెళతారా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడికైనా వస్తా ఎవరినైనా కలుస్తా’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్


హరీష్‌వి తప్పుడు లెక్కలు..

తాము జన్వాడలోనో, మొయినాబాద్‌లోనో ఫౌంహౌస్ కట్టుకోలేదన్నారు సీఎం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కోసమే అప్పులు చేయాల్సి వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయకపోతే.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు ఉండేవి కాదని.. బిల్లులు ఆగేవి కాదన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు ఉరేసినా తప్పులేదన్నారు. ఇష్టారీతిన అధిక వడ్డీ రేట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని మండిపడ్డారు. వడ్డీ శాతం తగ్గించమని ఆర్దిక శాఖ మంత్రి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పాటు నాటికి రాష్ట్ర అప్పు 7 ,11,911 కోట్లు. నేటికి రాష్ట్ర అప్పు రూ.7,22,788 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేసిందని హరీష్ రావు అంటుంటున్నారు. కానీ మేము చేసిన అప్పు కేవలం రూ.11 వేల కోట్లే. సంవత్సరంలో మేము ఏం చేయలేదని విమర్శిస్తున్న బీఆర్ఎస్... పదేళ్ళలో ఒక్క హాస్టల్‌కైనా పర్మినెంట్ బిల్డింగ్ కట్టారా.. బాత్రూమ్‌లు లేక.. నీళ్లు తాగితే బాత్రూమ్ వస్తుందని ఆడ పిల్లలు నీళ్లు తాగడం లేదు. 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం.. మేము భూములు అమ్మి.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. 19 కార్పోరేషన్‌ల పేరు మీద రూ.1,29,650 కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసింది. కార్పోరేషన్‌లలో చేసిన అప్పుకు.. కార్పోరేషన్‌లే అప్పు కడతాయని అగ్రిమెంట్ చేసుకున్నారు. హరీష్ రావు తప్పుడు లెక్కలు చూయించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ బొందల గడ్డగా మార్చింది. తప్పుడు లెక్కలు చూపించి.. అధిక అప్పులు తెచ్చారు.. ఇప్పుడు ఆ తప్పుడు లెక్కలనే తమ గొప్పగా చెప్పుకుంటున్నారు’’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ నీతులు అవసరం లేదు.. బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్

Hyderabad: టార్గెట్‌ న్యూ ఇయర్‌ వేడుకలు.. ముంబై నుంచి నగరానికి ఎండీఎంఏ డ్రగ్స్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 03:52 PM