Telangana Politics: ఉత్కంఠ రేపుతున్న సీఎం రేవంత్ సమావేశం.. ఎందుకంటే..!
ABN , Publish Date - May 30 , 2024 | 11:06 AM
రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 4గంటలకు సమావేశం ఉన్నట్లు ప్రతిపక్షాలకు ఆహ్వానం పలికారు. రాష్ట్ర నూతన చిహ్నం, గీతంపై వారితో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి ముఖ్యమంత్రి రేవంత్ వివరించనున్నారు. ఈ సమావేశానికి పలు పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం(Sachivalayam)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revath Reddy) ప్రతిపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 4గంటలకు సమావేశం ఉన్నట్లు ప్రతిపక్షాలకు ఆహ్వానం పలికారు. రాష్ట్ర నూతన చిహ్నం, గీతంపై వారితో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి ముఖ్యమంత్రి రేవంత్ వివరించనున్నారు. ఈ సమావేశానికి పలు పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతంలో మార్పులపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. మార్పులు చేస్తే సహించేది లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS working President KTR) సహా ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణం రాచరికపు గుర్తులు కావని.. తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేయనున్న సమావేశం ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ తాను తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తారా? లేక ప్రతిపక్షాల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!
Crime news: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు అరెస్టు