TG Politics: టీపీసీసీ చీఫ్ ఎంపికలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. కుల గణనను పక్కనపెట్టేందుకేనా..!
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:34 PM
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయడం వెనుక కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది పోటీ పడినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒకరికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందట. తెలంగాణలో ఎక్కువమంది బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఉండటంతో వాళ్లకే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపిందనే ప్రచారం నడుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి రెండు, మూడు పేర్లు వినిపించినా విద్యార్థి నాయకుడిగా ఎన్‌ఎస్‌యూఐలో కీలకంగా పనిచేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌ను అదృష్టం వరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ బీసీ నేత వైపు మొగ్గుచూపడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది.
CM Revanth: సీఎం రేవంత్, మంత్రులపై మహేశ్వర రెడ్డి నిప్పులు
కులగణన నేపథ్యంలో..
ప్రస్తుతం తెలంగాణలో కులగణనకు సంబంధించిన అంశపై ఎక్కువుగా చర్చ జరుగుతోంది. కులగణన చేసి బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కులగణన చేపడితే ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో పాటు పార్టీలోనే కొంతమంది దీనిపై అయిష్టంగా ఉన్నారనే చర్చ ఉంది. అక్టోబర్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కులగణన నిర్వహించకుండా ఎన్నికలకు వెళ్తే బీసీల్లో తిరుగుబాటు వస్తుందనే ఆలోచనతోనే ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడిని పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసి ఉండవచ్చనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది. బీసీలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ద్వారా వెనుకబడిన వర్గాలపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఎలాంటిదో అర్థమవుతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. త్వరలోనే కులగణన చేస్తామని పీసీసీ కొత్త చీఫ్‌తో ప్రకటన చేయించి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తైతే ఆ తర్వాత ఎప్పుడు కులగణన చేసినా మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. బీసీల్లో తిరుగుబాటు చేయకుండా ఉండే ఉద్దేశంతోనే బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Akbaruddin Owaisi: ఆ స్కూల్ మాత్రం కూల్చకండి.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలనం
రెడ్డి, బీసీ కాంబినేషన్..
సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో మరో రెడ్డి లేదా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత విబేధాలు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన హైకమాండ్ పీసీసీ చీఫ్ పదవి బీసీకి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త పీసీసీ చీఫ్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో.. అప్పటివరకు రేవంత్ రెడ్డిని కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు పూర్తికావడంతో కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త చీఫ్ ఎంపికకోసం హైకమాండ్‌తో రేవంత రెడ్డి రెండు, మూడుసార్లు చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం మాత్రం పీసీపీ చీఫ్ ఎంపిక పూర్తైందని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందనే చర్చ జరుగుతోంది.
HYDRA News: హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News