Share News

Hyderabad: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:40 AM

సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మృతిని నిరసిస్తూ నిన్న (ఆదివారం) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేశారు.

Hyderabad: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..
Attack on Allu Arjun House

హైదరాబాద్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) ఘటనలో రేవతి (Revathi) మృతిని నిరసిస్తూ నిన్న(ఆదివారం) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి (Attack on Allu Arjun House) చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ (Remand) విధించింది. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేశారు. బన్నీ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీలు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, నేడు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 09:27 AM