Narayana: కేసీఆర్‌ను జగన్ కలవడంపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 04 , 2024 | 02:31 PM
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ కలవడంపై సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్ కలిశారని విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు. తన ఇంట్లో తానే జగన్ గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారన్నారు.
హైదరాబాద్, జనవరి 4: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (BRS Chief KCR) ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కలవడంపై సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్ కలిశారని విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు. తన ఇంట్లో తానే జగన్ గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారన్నారు. చెల్లిని, బాబాయ్‌ను దూరం చేసుకున్నారని.. అధికారానికి కూడా దూరమవుతారని వ్యాఖ్యలు చేశారు.
జగన్‌లో మెదటసారి ఓటమి భయం కన్పిస్తుందని.. అందుకే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో సాయం కోసమే జగన్.. కేసీఆర్ దగ్గరకి వవ్చారన్నారు. కేసీఆర్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రయత్నించి జగన్ విఫలమయ్యారన్నారు. పోలింగ్ రోజు నాగార్జునసాగర్‌లో లేని గొడవ సృష్టించి జగన్ విఫలమయ్యారని అన్నారు. పొత్తు పేరుతో చంద్రబాబును బీజేపీ నష్టపరచాలని చూస్తోందని అన్నారు. తమను ప్రశ్నించిన వారిని కేంద్రం 17ఏ పేరుతో బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్‌ను కూడా 17ఏతో బీజేపీ భయపెట్టిస్తోందని నారాయణ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..