Allu Arjun arrested: చంచల్‌గూడజైలులో అల్లు అర్జున్‌కు కల్పించే సౌకర్యాలు ఇవే
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:17 PM
దేశంలో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా, ఖైదీలుగా శిక్షను అనుభవించారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. రిమాండ్ ఖైదీ విషయంలో జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తారు. ముఖ్యంగా వీఐపీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. రిమాండ్ ఖైదీకి ఎలాంటి ఇబ్బంది కలిగినా జైలు అధికారులు కోర్టులో బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వీఐపీల విషయంలో..
సంథ్య థియేటర్‌లో పుష్ఫ-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. జైలులో కరుడుగట్టిన నేరస్తులు ఎందరో ఉంటారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను జైలులో ఏ గదిలో పెడతారు. అందరు రిమాండ్ ఖైదీల వలె అల్లు అర్జున్‌ను ట్రీట్ చేస్తారా.. ఏమైనా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారా అనే ప్రశ్నలు రావడం సహజం. దేశంలో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా, ఖైదీలుగా శిక్షను అనుభవించారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు.
రిమాండ్ ఖైదీ విషయంలో జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తారు. ముఖ్యంగా వీఐపీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. రిమాండ్ ఖైదీకి ఎలాంటి ఇబ్బంది కలిగినా జైలు అధికారులు కోర్టులో బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వీఐపీల విషయంలో ఎలా వ్యవహారించాలనే విషయంలో న్యాయమూర్తి రిమాండ్ విధించే సమయంలోనే కొన్ని ఆదేశాలు జారీచేస్తారు. ఈ ఆదేశాలను జైలు అధికారులు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నిందితుడి తరపున న్యాయవాది కోర్టులో అభ్యర్థిస్తే ప్రత్యేక వసతులు కల్పిస్తారు. ముఖ్యంగా ఆహారం విషయంలోనే ప్రముఖ వ్యక్తులకు, సామాన్య రిమాండ్ ఖైదీలకు వ్యత్యాసం ఉంటుంది. రెండు రోజులకు ఓసారి వైద్య పరీక్షలు చేయిస్తారు. సామాన్య వ్యక్తులైతే ఎదైనా ఆరోగ్య సమస్య ఉందని జైలు వార్డర్‌కు చెబితే వైద్యుడు అందుబాటులో ఉండే సమయంలో చెకప్ కోసం పంపిస్తారు. ప్రముఖ వ్యక్తులు జైలులో ఉండేటప్పుడు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
జైలులో కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే
సామన్య వ్యక్తులకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తే జైలులో ఉండే బ్యారక్‌లలో పెడతారు. ఒక బ్యారక్‌లో పది నుంచి పదిహేను గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు నుంచి ఐదుగురుని పెడతారు. ఒక బ్యారక్‌లో సామూహిక టాయిలెట్స్ ఉంటాయి. ఆ బ్యారక్‌లో ఉండే 50 నుంచి 60 మంది అక్కడ ఉండే సామూహిక టాయిలెట్స్ ఉపయోగించుకోవాలి. అదే విఐపిల విషయంలో ఒక రిమాండ్ ఖైదీకి ప్రత్యేక గది కేటాయిస్తారు. ఆ గదిలో సపరేట్ టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి. ఓపెన్ జైలులోకి విఐపిలను అనుమతించరు. వారికి అవసరమైన వస్తువులు, ఆహారాన్ని సమయానికి జైలు అధికారులు అందిస్తారు. సామాన్య రిమాండ్ ఖైదీలకు జైలులో వండే ఆహారం పెడతారు. విఐపీలో విషయంలో మాత్రం ఇంటి నుంచి లేదా కుటుంబ సభ్యులు అందించిన ఆహారాన్ని అందజేస్తారు. వారి ఆహారపు అలవాట్లకు తగిన విధంగా జైలులో ఫుడ్ ఉండకపోవవడంతో వారికి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా బయట నుంచి ఆహారాన్ని అనుమతిస్తారు.
రిమాండ్‌లో ఉండే ఖైదీలను ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ జైలులో పెడతారు. ఆ సమయంలో రిమాండ్ ఖైదీలతో జైలులో సామాజిక పరివర్తన కోసం వారితో తోట పని, వంట పని చేయిస్తుంటారు. రిమాండ్ ఖైదీలకు పని విషయంలో మినహాయింపు ఉంటుంది. అల్లు అర్జున్ ప్రముఖ నడుటు కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేకంగా చూస్తారు. భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here