Justice Lakshminarayana: DRT అడ్వకేట్స్ అసోసియేషన్ లైబ్రరీ ప్రారంభించిన హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ
ABN , Publish Date - Jun 25 , 2024 | 02:34 PM
డెబిట్స్ రికవరీ ట్రైబ్యునల్(DRT) అడ్వకేట్స్ అసోసియేషన్ లైబ్రరీని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి (Justice Lakshminarayana Alisetty) ప్రారంభించారు. DRT-1 ప్రిసైడింగ్ అధికారి గుమ్మడి గోపీచంద్, DRT-2 ప్రిసైడింగ్ అధికారి రామేశ్వర్ గంగారామ్ కోతె సమక్షంలో సోమవారం దివంగత అనిల్ కుమార్ మెమోరియల్ లైబ్రరీ, లేడీ అడ్వకేట్స్ రూమ్‌ను జస్టిస్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
హైదరాబాద్: డెబిట్స్ రికవరీ ట్రైబ్యునల్(DRT) అడ్వకేట్స్ అసోసియేషన్ లైబ్రరీని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి(Justice Lakshminarayana Alisetty) ప్రారంభించారు. DRT-1 ప్రిసైడింగ్ అధికారి గుమ్మడి గోపీచంద్, DRT-2 ప్రిసైడింగ్ అధికారి రామేశ్వర్ గంగారామ్ కోతె సమక్షంలో సోమవారం దివంగత అనిల్ కుమార్ మెమోరియల్ లైబ్రరీ, లేడీ అడ్వకేట్స్ రూమ్‌ను జస్టిస్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో లైబ్రరీ ప్రాముఖ్యతను లాయర్లకు ఆయన వివరించారు. జూనియర్ లాయర్లకు లైబ్రరీ ఎంతోగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్రంథాలయం ఏర్పాటులో DRT-1, DRT-2 ప్రిసైడింగ్ అధికారులు గుమ్మడి గోపీచంద్, రామేశ్వర్ గంగారామ్ కోతె, అసోసియేషన్ చొరవపై జస్టిస్ లక్ష్మీనారాయణ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోఅసోసియేషన్ ప్రెసిడెంట్ జి.కె.దేశ్‌పాండే, వైస్ ప్రెసిడెంట్ ఎన్.వి.సుబ్బరాజు, జనరల్ సెక్రటరీ డి.రాఘవులు, జాయింట్ సెక్రెటరీ కె.కల్యాణ్ చక్రవర్తి, ట్రెజరర్ అదిరన్ కిరణ్ రాజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ సి.హెచ్.కిషోర్, లైబ్రేరియన్ టి.రణ్‌దీర్ సింగ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు ఎ.నరేశ్, జె.నరేంద్ర కుమార్, శ్రవణ్ కుమార్ రాగి, జి.పుష్కల, పి.రాజేశ్వరి, పలువురు సీనియర్, జూనియర్ లాయర్లు పాల్గొన్నారు.