DSC 2024: టీచర్ పోస్టింగులు వాయిదా
ABN , Publish Date - Oct 15 , 2024 | 10:21 AM
డీఎస్సీ 2024 అభ్యర్థుల పోస్టింగ్ వాయిదా పడింది. ఈ రోజు పోస్టింగ్ ఇస్తామని ముందుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. చివరి క్షణంలో పోస్టింగ్ పోస్ట్ పోన్ అని సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్: ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు వాయిదా పడింది. డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు అందుకున్న పదివేల ఆరు మంది కొత్త టీచర్లకు ఈ రోజు పోస్టింగ్ ఇవ్వనున్నామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దాంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా డీఈఓ కార్యాలయాలకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ వాయిదా పడిందని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు.
ఫోన్ల ద్వారా సమాచారం..
సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సోమవారం ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. చెప్పినట్టుగా మంగళవారం ఉదయం 9 గంటలకు కార్యాలయాలకు వచ్చారు. అక్కడ వారికి చుక్కెదురైంది. కౌన్సిలింగ్ వాయిదా పడిందని ప్రకటంిచారు. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ కోసం ఉదయం 6 గంటలకు టెంట్లు వేశారు. వాటిని 9 గంటలకు తీసివేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా
ఇటీవల అభ్యర్థులు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ రోజు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. పోస్టింగ్ కౌన్సెలింగ్ సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
కలిసొచ్చే కాలానికి.. అందొచ్చిన కొడుకులు!