Share News

Rythu Runa Mafi: రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. గైడ్ లైన్స్ ఇవే..!!

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:02 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Rythu Runa Mafi: రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. గైడ్ లైన్స్ ఇవే..!!
Loan Waiver

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.


మార్గదర్శకాలు

రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తోందని షరతు విధించారు. రాష్ట్రంలో గల షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం రుణ మాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు.


డీఓఏ ఆధ్వర్యంలో

వ్యవసాయశాఖ కమిషనర్, సంచాలకులు (డీఓఏ) పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్‌లో గల నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎస్ఐఐసీ) ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్బీఐ కలిసి ఐటి పోర్టల్ నిర్వహిస్తారు. ఆ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఐటి పోర్టల్ ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌కి బిల్లులు సమర్పించడం, పథకానికి సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి.



ALSO READ:
Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ఘాటు వ్యాఖ్యలు

నోడల్ అధికారి

పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్) నియమిస్తారు. బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

Tourists: వికారాబాద్‌లో టూరిస్టులకు వింత కష్టాలు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 04:48 PM