Hyderabad: మింట్‌కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 24 , 2024 | 10:16 AM
Telangana: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో గల ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్, జనవరి 24: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో గల ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయి. అయితే కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..