Fire Accident: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపీంలో అగ్పిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు..
ABN , Publish Date - Dec 23 , 2024 | 07:01 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానశ్రయ పరిధిలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణం జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తులో మంటలు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానశ్రయ పరిధిలోని ఓ బ్యాటరీ కంపెనీ కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణం జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తులో మంటలు ఎగసిపడుతుండటంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను నియంత్రణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వ్యాప్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో కింది అంతస్తుల్లో ఉన్న కార్మికులు బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here