Share News

Harish Rao: అక్కడకు వెళ్లేందుకు ఉన్న సమయం.. రైతులను పట్టించుకునేందుకు లేదా

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:45 PM

Telangana: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు విమర్శించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Harish Rao: అక్కడకు వెళ్లేందుకు ఉన్న సమయం.. రైతులను పట్టించుకునేందుకు లేదా
Former Minister Harish Rao

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఎక్స్‌ వేదికగా మంత్రి పోస్టు చేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు కూడా అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

AP Budget 2024: ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..


పత్తి రైతులు రోడ్లెక్కి లబోదిబోమంటుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయ లోపంతో పత్తి రైతులు చిత్తవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలన్నారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా అని అడిగారు. తేమ శాతం సడలింపు, కొత్త నిబంధనల విషయమై ఢిల్లీకి వెళ్లి సీసీఐ అధికారులకు విజ్ఞప్తి చేసే తీరిక లేదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి తేమ శాతం సహా ఇతర నిబంధనల విషయంలో కేంద్రంపై, ఒత్తిడి తేవాలని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ హరీష్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.

AP Budget 2024-25: అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్.. అబాసుపాలైన వైసీపీ..



కాగా... ఈరోజు నుంచి రాష్ట్రంలో పత్తికొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తామని తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ‘‘కొనుగోళ్లను నిలిపేశాం. రైతులు సహకరించాలి. దయచేసి పత్తిని తీసుకురావొద్దు’’ అంటూ కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కొత్త నిబంధనలే.. మిల్లర్లు ఈ మేరకు నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 పేరుతో కొనుగోళ్ల బాధ్యతలను విడతల వారీగా చేపట్టాలని సీసీఐ నిర్ణయించింది. అంటే.. పత్తి జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ జాబ్‌వర్క్‌ను సీసీఐ మూడు క్యాటగిరీలుగా విభజించింది. అతి తక్కువ ధరకు జిన్నింగ్‌ చేసే మిల్లర్లను ఎల్‌-1, కాస్త ఎక్కువ కోట్‌ చేసిన వారిని ఎల్‌-2, అధిక ధరకు జిన్నింగ్‌ చేస్తామనే వారిని ఎల్‌-3 క్యాటగిరీలుగా విభజించింది. తొలుత కొనుగోలు బాధ్యతలను ఎల్‌-1 మిల్లర్లకు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 318 జిన్నింగ్‌ మిల్లులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసింది. మిల్లర్లు పత్తిలో గింజలను తొలగించి, జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ చేసి.. బేళ్లుగా మార్చాక.. తిరిగి సీసీఐ స్వాధీనం చేసుకుంటుంది. మిల్లర్ల నిర్ణయంలో ఆరుగాలం శ్రమించి, పత్తిని పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి..

AP Assembly Budget Session: ఇది మర్యాదేనా జగన్‌!

Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 12:45 PM