Share News

KTR: లగచర్ల రైతన్నలతో కేటీఆర్ ములాఖత్

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:56 PM

Telangana: హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ బాధితులకు అండగా ఉంటారన్నారు. ‘‘మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుందన్నారు. బాధితులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు.

KTR: లగచర్ల రైతన్నలతో కేటీఆర్ ములాఖత్
Former minister KTR

సంగారెడ్డి, నవంబర్ 15: లగచర్లలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి జరిగాక బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) అన్నారు. సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం ములాఖాత్ కోసం వెళ్ళింది. అనంతరం కేటీఆర్ మీడియా మాట్లాడుతూ.. జైలులో ఉన్న వారిని థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు పెట్టారన్నారు. మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్ళని కొడుతామని బెదిరించారన్నారు. కొడంగల్ ఎస్సై, సీఐ వందల మంది పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు బూతులు మాట్లాడుతూ దాడి చేశారన్నారు. ‘‘సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే.. మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్



సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లోను అలాగే గొడవ జరుగుతుందన్నారు. హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ బాధితులకు అండగా ఉంటారన్నారు. ‘‘మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు’’ అని అన్నారు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుందన్నారు. బాధితులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడేవాడు లేడన్నారు. అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతామన్నారు. 30, 40 కిలోల బరువు లేని పిల్లలు కూడా కలెక్టర్‌ను కొట్టారు అని కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు బీఆర్‌ఎస్ పార్ట అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, సీనియర్ నేత జాన్సన్ నాయక్ ఉన్నారు.


కాగా.. సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామ రైతులను పరామర్శించేందుకు ఈరోజు ఉదయం నందినగర్‌లోని నివాసం నుంచి కేటీఆర్‌ సంగారెడ్డికి బయలు దేరారు. ముందుగా పటాన్‌చెరు చేరుకున్న మాజీ మంత్రికి పటాన్‌చెరు ఐబీవద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆపై కందికి చేరుకున్న కేటీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్వాగతం పలికారు. అనంతరం కందిలోని సంగారెడ్డి జైలుకు చేరుకుని లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న 16 మంది రైతులతో ములాఖత్ అయ్యారు. లగచర్ల ఘనటలో ఇప్పటికే 47 మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..

Caste Census: అధికారుల వద్ద ఉండాల్సిన కులగణన పత్రాలు.. ఎక్కడున్నాయో చూడండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 01:56 PM