KTR: మొగిలయ్య మృతి పట్ల కేటీఆర్ సంతాపం
ABN , Publish Date - Dec 19 , 2024 | 10:38 AM
Telangana: జానపద గాయకుడు మొగిలయ్య మృతి పట్ల మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. మొగులయ్య కుటుంబసభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 19: బలగం మొగిలయ్య మృతి పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు. మొగులయ్య చనిపోయినా పాటల రూపంలో బతికే ఉన్నారన్నారు. మొగులన్న పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని.. మాయమైపోతున్న కుటుంబ బంధాలను మళ్లీ గుర్తు చేసిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. మొగిలయ్య కుటుంబసభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేటీఆర్ ట్వీట్..
నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు
చలించని హృదయం లేదు
నీ పాట ద్వారా
తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్
మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది!
మొగులన్నా..
నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది!
మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది!
మొగుల మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Srinivas Goud: తెలంగాణలో లబ్ధి పొందింది.. ఆంధ్రవాళ్లే.. శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
తెల్లవారుజామున కన్నుమూత
జానపద గాయకుడు మొగిలయ్య ఈరోజు (గురువారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కిడ్నీ ఫెయిల్ అయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో మరణించారు. బలగం సినిమాలో ఆయన పాడిన ‘‘ తోడుగా నాతోడుంటూ’’ పాట ఎంతటి ఆదరణను పొందిందో అందరికీ తెలిసిందే. ఆ పాటతో మొగిలయ్య చాలా ఫేమస్ అయ్యారు. ఆ తరవాత కొన్నాళ్లకు మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలిసిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఆదుకుంది. అలాగే బలగం డైరెక్టర్ వేణు, మెగాస్టార్ చిరంజీవి కూడా మొగిలయ్యకు ఆర్థిక సాయం అందజేశారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి చికిత్స పొందారు మొగిలయ్య. కిడ్నా సంబంధిత వ్యాధితో ప్రతీ రోజు మొగిలయ్య డయాలసిస్ చేయించుకున్నారు. ఆ తరువాత తీవ్ర అనారోగ్యంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News