Street Food: జనాలను భయపెట్టేలా స్ట్రీట్ ఫుడ్స్.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:25 AM
Telangana: నలుగురు స్నేహితులు కలిసి ఎంజాయ్ చేసేందుకు బయటకు వచ్చారు. ఇంకేముంది సరదాగా తిరిగి ఏదైనా తినాలి అని భావించి హోటల్‌కు వెళ్లారు. అయితే అక్కడ వారు తిన్న పదార్థంతో ఆస్పత్రిపాలయ్యారు. ఇంతకీ వారు ఏం తిన్నారు... వారు అస్వస్థతకు గురవడానికి కారణమైన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్, నవంబర్ 9: సరదాగా బయటకు వెళ్లినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినడం కామన్. వారాంతరాల్లో కొందరూ అదే పనిగా బయటకు వెళ్లి మరీ స్ట్రీడ్ ఫుడ్‌ను తింటుంటారు. వారానికి ఒక్కసారైనా బయటఫుడ్ తినాలని ఆలోచించే వారు ఉంటారు. అలాగే పానీపూరీ, కబాబ్స్, బర్గర్లు, షవర్మా, బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తింటారు. అయితే స్ట్రీట్ ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు.
CM Chandrababu: ఏలూరు పోలీసులకు చంద్రబాబు అభినందనలు
డబ్బు అత్యాశకు పోయి నాణ్యతతో కూడిన ఫుడ్‌ను ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారు వ్యాపారులు. వ్యాపారమే ముఖ్యమని భావించే కొందరు వ్యక్తులు.. ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపరు. ఫలితంగా స్ట్రీట్ ఫుడ్ తిని పలువురు అవస్వస్థతకు గురవుతున్న వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇటీవలే మొమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. పలువురు అస్వస్థత గురైన విషయం తెలిసిందే. ఇది మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
నలుగురు స్నేహితులు కలిసి సరదాగా బయటకు వచ్చారు. ఇంకేముంది సరదాగా తిరిగి ఏదైనా తినాలి అని భావించి హోటల్‌కు వెళ్లారు. అయితే అక్కడ వారు తిన్న పదార్థంతో ఆస్పత్రిపాలయ్యారు. ఇంతకీ వారు ఏం తిన్నారు... వారు అస్వస్థతకు గురవడానికి కారణమైన ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలోని గ్రిల్ హౌస్‌లో షవర్మ తిని నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓల్డ్ ఆల్వాల్ సూర్యనగరకు చెందిన రాజు, రాము, హరీష్, సతీష్‌లు రెండు రోజుల క్రితం గ్రిల్ హౌస్‌లో షవర్మ తిన్నారు. అయితే షవర్మ తిన్న కొన్ని గంటల్లోనే వాంతులు, విరోచనాలతో ఆ నలుగురు యువకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Beer: బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
అయితే వీరిలో రాజు, రాము పరిస్థితి విషమించడంతో ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యువకుల కుటుంబసభ్యులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గత 15 రోజుల క్రితం షవర్మ తిన్న పలువురు అనారోగ్యానికి గురవడంతో ఆహార భద్రతాధికారులు గ్రిల్ హౌస్‌ను మూసి వేశారు. తిరిగి మూడు రోజుల క్రితమే గ్రిల్ హౌస్‌ను తెరిచి వ్యాపారాన్ని నిర్వహించారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ గ్రిల్‌హౌస్ యాజమాన్యంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ నందినగర్‌లో మొమోస్ తిని ఓ మహిళ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మొమోస్‌ను తినడంతో మహిళ మృతి చెందగా.. మరో 20 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయట ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. బయట ఫుడ్‌ను అవాయిడ్ చేయడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News