TS News: హైదరాబాద్‌లో థార్ దొంగల ముఠా అరెస్ట్..
ABN , Publish Date - Aug 09 , 2024 | 04:33 PM
Telangana: రాచకొండ పరిధిలో థార్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్స్ బస్సులలో దోపిడీలకు పాల్పడుతూ దొరికకాడికి దోచుకుంటుంది. ఇలా చోరీ చేసిన బంగారంతో పారిపోతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు థార్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 9: రాచకొండ పరిధిలో థార్ దొంగల ముఠాను పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేశారు. ఈ ముఠా ట్రావెల్స్ బస్సులలో దోపిడీలకు పాల్పడుతూ దొరికకాడికి దోచుకుంటుంది. ఇలా చోరీ చేసిన బంగారంతో పారిపోతుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు థార్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. క్రెటా కార్లో పారిపోతుండగా చౌటుప్పల్ వద్ద రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 2 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
KTR: కవిత జైలులో ఇబ్బంది పడుతోంది.. కేటీఆర్ ఆవేదన
ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ... అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాదాపు కోటి 26 లక్షల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దొంగలను పట్టుకున్నామన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నారన్నారు. పక్కా సమాచారం బస్సులో వెళ్తున్న బంగారు ఆభరణలను దొంగిలిస్తారన్నారు.
Supreme Court: విద్యాసంస్థల్లో హిజాబ్‌లు ధరించొచ్చు.. సుప్రీం సంచలన తీర్పు
క్రెటా కార్‌లో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ను వెంబడిస్తారని... మధ్యలో బస్సు ఆగినప్పుడు బంగారం దోచుకెళ్తున్నారని చెప్పారు. ముంబై నుంచి బంగారం ఆభరణలను తీసుకెళ్తున్న వారిని టార్గెట్ చేస్తారన్నారు. ఈరోజు కేసులో ఒక వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఏ -3 సోనూ టాగూర్ మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో ఇద్దరు ఏ1, ఏ2 పరారీ లో ఉన్నారన్నారు. 1,832 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
KTR: ప్రభుత్వ నిర్వాకంతో నగర ప్రజలకు తీవ్ర నష్టం
Bhatti Vikramarka: ఆగస్టు 15న రైతులను రుణ విముక్తి చేస్తాం..
Read Latest Telangana News And Telugu News