Share News

TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:32 PM

తెలంగాణలో ఆగస్టు 15 సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల(Prisoners) విడుదలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor C.P. Radhakrishnan) పచ్చజెండా ఊపారు. దీంతో 231మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు మూడ్రోజుల కిందట పంపించిన లిస్టుకు ఆయన ఆమోదం తెలిపారు.

TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..

హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 15 సందర్భంగా సత్ప్రవర్తన సత్ర్పవర్తన కలిగిన ఖైదీల(Prisoners) విడుదలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(Governor C.P. Radhakrishnan) పచ్చజెండా ఊపారు. దీంతో 231మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు మూడ్రోజుల కిందట పంపించిన లిస్టుకు ఆయన ఆమోదం తెలిపారు. గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యి సుమారు రెండు గంటలపాటు పలు అంశాలపై చర్చించారు.


మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు, ఆగస్టు 15న ఖైదీల విడుదల, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, రాష్ట్ర విభజన అంశాలపై గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఏళ్ల తరబడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 231మంది విడుదల కానున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష, శిక్షల నుంచి ఉపశమనం కల్పించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

Updated Date - Jul 01 , 2024 | 05:32 PM