Harish Rao: అసెంబ్లీ దెబ్బకే రేవంత్ ఇవాళ ప్రజాభవన్‌కు వెళ్లాలనే నిర్ణయం
ABN , Publish Date - Feb 16 , 2024 | 10:27 AM
అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాభవన్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు ఆయన కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిరోజూ ప్రజాభవన్‌కు వెళ్తానని చెప్పిన రేవంత్ తొలి రోజు మాత్రమే వెళ్లారన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాభవన్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నేడు (శుక్రవారం) ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిరోజూ ప్రజాభవన్‌కు వెళ్తానని చెప్పిన రేవంత్ తొలి రోజు మాత్రమే వెళ్లారన్నారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో తాము ఆధారాలతో సహా నిలదీశామన్నారు. దీంతో ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి ప్రజాభవన్‌కు వెళ్తున్నారన్నారు. సీఎం ప్రజాభవన్‌కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారని హరీష్ రావు తెలిపారు.