Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన..
ABN , Publish Date - Aug 12 , 2024 | 12:40 PM
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షంలో ముందుకు కదలలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఆదివారం రాత్రి పలుప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం పడింది.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rains) కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షంలో ముందుకు కదలలేక వాహనదారులు (Motorists) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ (IMD) తెలిపింది. ఆదివారం రాత్రి పలుప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం పడింది. ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University) ప్రాంతంలో సుమారు 90 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఎన్‌సీహెచ్ కాలనీలో 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడిక్‌మెంట్‌లో 80.8 మిల్లీమీటర్లు.. బౌధ్దనగర్‌లో 80.9. మి.మీ. బారీ వర్షం కురిసింది.
ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు జిల్లాలకు అధికారులు అరెంజ్ అలెర్టు జారీ చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించి సోమవారం సాయంత్రం, రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ నగర ప్రాంతాలు షేక్‌పేట, టోలీ చౌక్, ఉత్తరపల్లి, రాజేంద్ర నగర్, లంగర్ హౌస్, ఉస్మానియా, తార్నాక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, భరత్‌నగర్, బోరబండ, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి ప్రాంతంలో కుండపోత వాన పడింది. ఉప్పల్, ఎల్‌బీనగర్, ఎస్‌ఆర్ నగర్‌లోనూ వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో పలుచోట్ల వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెంలో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. సికింద్రాబాద్‌లో కూడా వర్షాలు పడతాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆగష్టు 15న అన్న క్యాంటిన్లు రీఓపెన్
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదేనేమో..
సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్
ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News