Share News

Hyderabad Rains: మళ్లీ షురూ.. ఆ ఏరియాలో దంచికొడుతున్న వర్షం

ABN , Publish Date - Aug 21 , 2024 | 06:27 PM

గడిచిన మూడు, నాలుగు రోజులుగా భాగ్యనగరాన్ని వరణుడు వదలట్లేడు. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. బుధవారం కూడా అదే పరిస్థితి నెలకొంది.

Hyderabad Rains: మళ్లీ షురూ.. ఆ ఏరియాలో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్: గడిచిన మూడు, నాలుగు రోజులుగా భాగ్యనగరాన్ని వరణుడు వదలట్లేడు. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. బుధవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. నగరం పశ్చిమాన ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంపై వర్షం ఎఫెక్ట్ భారీగా ఉంటోంది. ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, కొండాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ, హఫీజ్‌పేట్, రాయదుర్గం, మియాపూర్, మదీనగూడ, అల్విన్ x రోడ్స్, బీహెచ్ఈఎల్ చౌరస్తా, నల్లగండ్ల, తెల్లాపూర్, హెచ్‌సీయూ, మసీద్ బండ, గుల్‌మోహర్ పార్క్ కాలనీ, లింగంపల్లి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, షేక్ పేట, ఖాజాగూడ, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. చిరు జల్లులు కురుస్తున్నాయి.


భారీగా ట్రాఫిక్ జామ్..

వర్షాల ప్రభావంతో శేరిలింగంపల్లిలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బీహెచ్ఈఎల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటం, దానికి వర్షాలు తోడవటంతో రెండు కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అటు అన్ని సిగ్నళ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఆఫీసులు విడిచిపట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి వచ్చేశాయి. ఐటీ కారిడార్ నుంచి వస్తున్న వాహనాలతో ఐకియా, రాయదుర్గం, హైటెక్ సిటీల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అటు నగరంలోని దాదాపు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు కిక్కిరిసి వస్తున్నాయి. ఇప్పటికే నగరానికి భారత వాతావరణ శాఖ నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

For Latest News and Telangana News click here

Updated Date - Aug 21 , 2024 | 06:27 PM