Share News

Hyderabad: లేడీలు కాదు.. పక్కా కేడీలు.. వీళ్లు చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:36 PM

Hyderabad: ఇద్దరు మహిళ.. చూసేందుకు బాగానే ఉంటారు.. చేసే పని కూడా పక్కా ప్రొఫెషనల్ వర్క్. ఇద్దరూ ఓ పార్లర్‌లో బ్యూటీషియన్లుగా పని చేస్తున్నారు. కానీ, బుద్ది వక్రమార్గం పట్టింది. వారిచే చేయకూడని పని చేయించింది. చివరకు వారిద్దరూ జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ఇద్దరు కిలాడీలు ఏం చేశారో ఓసారి ఈ కథనంలో చూసేయండి..

Hyderabad: లేడీలు కాదు.. పక్కా కేడీలు.. వీళ్లు చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Hyderabad Police

హైదరాబాద్, జనవరి 29: ఇద్దరు మహిళ.. చూసేందుకు బాగానే ఉంటారు.. చేసే పని కూడా పక్కా ప్రొఫెషనల్ వర్క్. ఇద్దరూ ఓ పార్లర్‌లో బ్యూటీషియన్లుగా పని చేస్తున్నారు. కానీ, బుద్ది వక్రమార్గం పట్టింది. వారిచే చేయకూడని పని చేయించింది. చివరకు వారిద్దరూ జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ఇద్దరు కిలాడీలు ఏం చేశారో ఓసారి ఈ కథనంలో చూసేయండి..

వలపు వల..

హైదరాబాద్‌లోని నాగోల్‌లో వృద్ధుడిపై వలపు వల విసిరి.. బంగారు గొలుసు కొట్టేసిన ఇద్దరు కిలాడీ లేడీలను అరెస్ట్ చేశారు పోలీసులు. వృద్ధుడి ఇంటికొచ్చి.. అతన్ని మాటల్లో పెట్టి బంగారు చైన్‌ను దొంగిలించారు ఈ కేడీలు. కానీ, ప్లాన్ బెడిసికొట్టింది. వృద్ధుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మాయలేడీలను మాటు వేసి పట్టుకున్నారు.

చేసే పని ఇదీ..

మేడ్చల్‌కు చెందిన పసుపులేటి శిరీష(36), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఉన్నీసా బేగం అలియాస్ సమీనా(40). ఇదదరూ బ్యూటీషియన్లుగా పని చేస్తూనే.. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. చేసే పనితో వస్తున్న డబ్బులు చాలక.. సులువుగా సంపాదించేందుక మాస్టార్ ప్లాన్స్ వేస్తుండేవారు. ఈ క్రమంలోనే.. వీరిద్దరికీ నాగోలు మత్తుగూడ సమీపంలోని ఓ హోటల్‌లో ఇటీవల ఓ వృద్దుడితో పరిచయం ఏర్పడింది. ఫోన్ ద్వారా వీరిద్దరూ ఆ వృద్దుడితో రొమాంటిక్‌గా మాట్లాడుతూ వలపు వల విసిరారు. ఈ క్రమంలోనే హోటల్‌కు రమ్మని అతన్ని పిలిచారు. అయితే, ఇంట్లో ఎవరూ లేరని, మీరే రావాలంటూ ఇద్దరు మహిళలకు వృద్దుడు చెప్పాడు. దాంతో ఇద్దరు మహిళలు.. అతని ఇంటికి వెళ్లారు. అతన్ని మాటల్లో పెట్టి మెడలోంచి 2 తులాల బంగారం చైన్ లాక్కొని పరారయ్యారు. దీంతో ఖంగుతిన్న వృద్దుడు.. పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. వృద్దుడి వద్ద నుంచి దోచుకున్న బంగారు గొలుసు స్వాధీనం చేసుకుని, ఇద్దరు మహిళలను రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 29 , 2024 | 05:36 PM