Share News

Hyderabad: సగం ఖాళీ అయిన భాగ్యనగరం..

ABN , Publish Date - Oct 11 , 2024 | 11:13 AM

బంధువులతో కలిసి దసరా పండుగ చేసుకునేందుకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ప్రజలు తరలివెళుతున్నారు. రెండు రోజులుగా ప్రయాణి కుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నప్పటికి బుధవారం నుంచి రద్దీ పెరిగింది. బస్‌ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

Hyderabad: సగం ఖాళీ అయిన భాగ్యనగరం..

హైదరాబాద్: మహా భాగ్యనగరం సగం ఖాళీ అయింది. శనివారం దసరా పండగ నేపథ్యంలో సెలవులు కావడంతో నగరవాసులు సొంతూళ్ళకు పయనమవుతున్నారు. జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గత నాలుగు రోజుల వ్యవధిలో 25 లక్షల మంది ప్రయాణికులు పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లలో ప్రయాణీకుల నుంచి 20 శాతం అదనపు చార్జీలను బాదుతున్నారు. అలాగే ప్రైవేటు ట్రావెల్స్‌లో రెండింతల చార్జీలు పెరిగాయి. టీజీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.


బంధువులతో కలిసి దసరా పండుగ చేసుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. రెండు రోజులుగా ప్రయాణి కుల సంఖ్య అంతంతమాత్రంగా ఉన్నప్పటికి బుధవారం నుంచి రద్దీ పెరిగింది. బస్‌ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. శుక్రవారం (11వ తేదీ) వరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయి. ప్రతీరోజు సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులు సీట్లు నిండిపోతున్నాయి. వీటితోపాటు ప్రైవేట్‌ వాహనాలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. వరుస సెలవులతో స్వగ్రామాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మీదుగా నడిపే పల్లెవెలుగు సర్వీసులు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గత మూడు రోజులుగా ఆక్యుపెన్సీ దాదాపు 80 శాతం వరకు పెరిగిందని చెబుతున్నారు.


13 నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు

దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రెగ్యులర్‌ సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు రద్దీని బట్టి సర్వీసులను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేష్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడకి మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.

అయితే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు కోటి 30 లక్షల మందిని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ తరలించింది. అటు దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్‌లు అయిన JBS, MGBSలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఇప్పటి వరకు 3వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాయ్ జమీమా దారుణాలు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 11 , 2024 | 11:13 AM