Traffic Challan: వాహనదారులకు ఝలక్.. అదంతా ఒట్టిదేనట..
ABN , Publish Date - Dec 26 , 2024 | 07:17 PM
చలాన్లు కట్టండయా అంటే.. ఒక్కరూ కట్టలేదు.. అదేమంటే.. గతంలో ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా ఆఫర్లు ఇస్తారేమోననే ఆశ. ఆ ఆశల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో జనాలు అబ్బ.. ఆఫర్ వచ్చేసిందోచ్ అని సంబరపడిపోయారు. కానీ, ఇంతలోనే ట్రాఫిక్ పోలీసులు సంచలన ప్రకటన విడుదల చేశారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి..
హైదరాబాద్, డిసెంబర్ 26: మీ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేశారా.. మీ వాహనంపై చలాన్లు భారీగా పేరుకుపోయాయా.. ఆ చలాన్లను ఇంకా క్లియర్ చేయలేదా.. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఎలాగూ ఆఫర్ ప్రకటిస్తుంది కదా అప్పుడు కట్టేద్దాంలే అని భావిస్తున్నారా.. ట్రాఫిక్ పోలీసులు ప్రకటించే ఆఫర్ కోసం వెయి కళ్లతో ఎదురు చూస్తున్నారా? అయితే, మీ ఎదురు చూపులకు ఫలితం ఉండదిక. అవును.. తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఈ అంశంపై బాంబ్ లాంటి వార్త పేల్చేశారు. ఆఫర్స్ గీఫర్స్ లేవు. ఉన్న చలాన్లన్నీ కట్టాల్సిందేనంటూ స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లను ఆఫర్‌లో కట్టేద్దాంలే అని భావిస్తున్న వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. రాయితీ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఆ వార్తలను నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే వాహనదారులు నమ్మాలని సూచించారు. వాహనదారులకు అనుమానాలు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
చలాన్లు కట్టండయా అంటే.. ఒక్కరూ కట్టలేదు.. అదేమంటే.. గతంలో ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా ఆఫర్లు ఇస్తారేమోననే ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు వాహనదారులు. గతంలో రెండు పర్యాయాలు ట్రాఫిక్ చలాన్లపై భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది ప్రభుత్వం. అదే మాదిరిగా ఈసారి కూడా ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆశల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించారంటూ ఆ వైరల్ మెసేజ్ సారాంశం. ఇంకేముంది.. అది చూసిన జనాలు.. అబ్బ.. ఆఫర్ వచ్చేసిందోచ్ అని సంబరపడిపోయారు. కానీ, ఇంతలోనే ట్రాఫిక్ పోలీసులు సంచలన ప్రకటన విడుదల చేశారు. ఆఫర్ గీఫర్ ఏం లేదని తేల్చి చెప్పారు. అలాంటిదేమైనా ఉంటే.. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని.. అక్కడ మాత్రమే చూసుకోవాలని స్పష్టం చేశారు. ఆశపడి.. ఆవేశపడ్డారో.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మీ డబ్బులన్నీ కోల్పోవడం ఖాయం అని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read:
రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?
పార్క్ నుంచి జంప్ అయిన చిరుత..
For More Telangana News and Telugu New..