Share News

NH 65: హైదరాబాద్ - విజయవాడ హైవేపై.. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న స్పాట్స్ ఇవే

ABN , Publish Date - May 17 , 2024 | 06:04 PM

హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada High Way) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్‌ని అధికారులు గుర్తించారు.

NH 65: హైదరాబాద్ - విజయవాడ హైవేపై.. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న స్పాట్స్ ఇవే

హైదరాబాద్: హైదరాబాద్ - విజయవాడ హైవేపై(Hyderabad - Vijayawada Highway) నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఆ స్థాయిలోనే ప్రమాదాలూ జరుగుతుండటం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ - విజయవాడ హైవే(NH-65)పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్స్‌ని అధికారులు గుర్తించారు.

ఈ ప్రాంతాల్లో ప్రమాదాలను తగ్గించే అంశంపై డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈఎన్సీ గణపతి రెడ్డి, జాతీయ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఎన్ హెచ్ 65పై 17 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. అవి...


  • చౌటుప్పల్

  • పెదకాపర్లి

  • చిట్యాల

  • కట్టంగూర్

  • ఇనుపాముల

  • టెక్మట్ల

  • ఎస్.వీ.కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్

  • ఈనాడు జంక్షన్

  • దురాజ్ పల్లి జంక్షన్

  • ముకుందాపూరం

  • అకుపాముల

  • కోమరబండా ఎక్స్ రోడ్

  • కాటకమ్మగూడెం

  • మేళ్లచెరువు

  • శ్రీరంగాపురం

  • రామాపురం ఎక్స్ రోడ్

  • నవాబ్ పేట్ జంక్షన్


ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు జాతీయ రహదారుల శాఖ గుర్తించింది. సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం, జంక్షన్ డెవలప్ మెంట్స్, VUP (వెహికిల్ అండర్ పాస్)ల నిర్మాణం, రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రితో సమావేశం అనంతరం ప్రమాదాల నివారణకు చేపట్టబోతున్న పనుల్లో స్పష్టత రానుంది.

ఇవి కూడా చదవండి....

Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 06:04 PM