Share News

Hydra Team: బెంగళూరులో పర్యటిస్తున్న హైడ్రా బృందం..

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:50 PM

తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళన‌పై ఫోకస్ పెట్టనున్నారు.

Hydra Team: బెంగళూరులో పర్యటిస్తున్న హైడ్రా బృందం..

హైదరాబాద్: హైడ్రా బృందం (Hydra Team) బెంగళూరు (Bangalore)లో పర్యటిస్తోంది (Visit). కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt.,)తో పాటు సీఎస్ఆర్ (CSR) కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను మూడు రోజుల పాటు స్టడీ చేయనున్నారు. తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళన‌పై ఫోకస్ పెట్టనున్నారు. బాచుపల్లి ఎర్రగుంట చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, కూకట్ పల్లి నల్ల చెరువు, రాజేంద్రనగర్ అప్ప చెరువులకు హైడ్రా పునరుజ్జివం తేనుంది.

హైదరాబాద్ – బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలోని ‘హైడ్రా’ బృందం మూడు రోజుల పాటు బెంగళూరులో పర్యటిస్తుంది. అలాగే భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ మహానగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతో హైడ్రా అధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం.


కాగా భవన నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసే క్రమంలో హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భవన నిర్మాణాల అనుమతుల్లో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌ వంటి ప్రత్యేక విభాగాలు అన్ని అంశాలను పరిశీలించి నిర్మాణ అనుమతులిస్తాయని తెలిపారు. పార్కులు, కుంటలు, చెరువులను ఆక్రమించకుండా హైడ్రా పరిరక్షిస్తుందని చెప్పారు. హైడ్రా కారణంగా నిర్మాణాలకు అనుమతులు రావన్న ఆందోళన బ్యాంకర్లకు అవసరం లేదని వివరించారు. ప్రజా భవన్‌లో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకర్లు, రియల్టర్లు, బిల్డర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది వడ్డీ లేకుండా రూ.20 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించిందన్నారు.

వీలైతే అంతకుమించి రుణాలు ఇస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు వేగంగా రుణాలు మంజూరు చేయాలని, నిబంధనలను సులభతరం చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల రికవరీ 98 శాతంగా ఉందని, రిస్కు తక్కువగా ఉన్నందున ఈ సంఘాలకు వడ్డీని తగ్గించి, ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. కాగా, ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక(ఎంఎ్‌సఎంఈ) పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు విశాల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వమే బస్సులను కొనుగోలు చేసి మహిళా సంఘాలకు లీజుకివ్వాలన్న ఆలోచన ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, గిరిజన ప్రాంత సంఘాలు తీసుకున్న దాదాపు రూ.200 కోట్ల వరకు రుణాలను చెల్లించలేని స్థితిలో ఆ సంఘాలు ఉన్నాయన్నారు. వీటిని మాఫీ చేయడం లేదంటే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అవకాశమివ్వడం వంటి అంశాలను పరిశీలించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓయూలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం: కేటీఆర్

స్థల వివాదంపై పీవీ సింధు ఏమన్నారంటే..

డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం (ఫోటో గ్యాలరీ)

20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 07 , 2024 | 12:54 PM