Share News

TG News: ఉప్పల్ పీఎస్ పరిధిలో అమానవీయ ఘటన..

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:03 PM

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కొడుకు తన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు నిరసనకు దిగింది.

TG News: ఉప్పల్ పీఎస్ పరిధిలో అమానవీయ ఘటన..

హైదరాబాద్: ఉప్పల్ (Uppal) పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్‌ (Chilukanagar)లో అమానవీయ ఘటన జరిగింది. ఓ కొడుకు తన కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి ఇంటి ముందు నిరసనకు (Protest) దిగింది. పూర్తి వివరాలు.. చిలకానగర్‌లో నివాసముంటున్న వంగరి రమాదేవికి.. ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త చనిపోగా, కొడుకు శివశంకర్ డాక్స్ గ్లోబల్ హై స్కూల్‌ను సొంతంగా నడిస్తున్నారు.


అయితే కొడుకు శివశంకర్ తల్లి రమాదేవి ఆస్తిని బలవంతంగా తన పేరున రాయించుకున్నాడని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డ్ ఏజ్ హోమ్‌కు వెళ్లి ఉంది. అక్కడ ఆమె ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆమె ముగ్గురు కుమార్తెలు రామదేవిని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొడుకు శివశంకర్ పట్టించుకోకుండా బయటకు గెంటవేయడంతో ఆమె చిలకానగర్‌లో ఉంటున్న కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు మహిళ సంఘాలు మద్దతు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని చట్టం ప్రకారం శివశంకర్‌పై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో రమాదేవి ఆందోళన విరమించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: షర్మిల

చంద్రబాబు నివాసంలో సంబరాలు

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు.. వైసీపీకి వ్యథ..

బాబు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్!

మరింత దయనీయ స్థితిలో బీఆర్ఎస్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 05 , 2024 | 01:05 PM