Share News

Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:16 PM

పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలోనే..

Hyderabad: ఫిర్యాదుల వరద.. నాగార్జునకు షాక్ తప్పదా..!?
N Convention

హైదరాబాద్, ఆగష్టు 21: పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా.. అక్కడి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేస్తోంది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు పలువురు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది.


హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా విస్తరించి ఉన్న తమ్మిడి చెరువును కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఆక్రమణకు గురైంది. శిల్పారామం, శిల్ప కళావేదికలతో పాటు అనేకం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసినా.. వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై ‘దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును చెరబట్టి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. దీనిపై మా ‘జనం కోసం’ అనేక ఫిర్యాదులు చేసింది. లోకాయుక్త కంప్లైంట్ నెంబర్ 2815/2012/B1గా స్వీకరించి అధికారులకు అనేకమార్లు హెచ్చరికలు జారీ చేయగా.. 14-07-2014 ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించినట్లు డ్రామాలాడి మిన్నకుండి పోయారు. ప్రభుత్వ పెద్దల ‘మిలాఖత్’ ఈ చెరువుపై చర్యలు తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. మా ‘జనం కోసం’ సర్వే నెంబర్ 36, 37, 38/పి. 11/2, 11/36, 68/పి, 41/పి లకు చెందిన 29 ఎకరాల 24 గుంటల చెరువు, ప్రభుత్వ భూమి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లపై ఉన్న కబ్జాలను తొలగించి.. ‘తమ్మిడి చెరువు’ను పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేశాం.’ అని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదును అందజేశారు.


జన్వాడ్ ఫామ్ హౌస్ కూల్చొద్దు..

ఇదిలాఉంటే.. జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చొద్దంటూ బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో.. దానిని కూల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ప్రదీప్ రెడ్డి.. ఫామ్‌హౌస్‌ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్‌పల్లి రెవిన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను చేర్చారు.


Also Read:

Hyderabad: జాడలేని మాన్‌సూన్‌ టీంలు..

మరో రియల్‌ బూమ్‌ రాబోతోంది

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 21 , 2024 | 12:16 PM