Share News

Telangana: బావ బామ్మర్దుల తీరు ఈస్టమన్ కలర్ లాగా ఉంది

ABN , Publish Date - Oct 19 , 2024 | 02:33 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ఆదాయం ఎంత? అవినీతి ఎంత? నాడు అప్పు ఎంత? ఎవరెవరు ఎంత దోచుకున్నారో చర్చిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియంలో మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజలు చూసే విధంగా ఈ అంశంపై చర్చ చేద్దామని బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మీ అవినీతి, అక్రమాలు, దోపిడికి సంబంధించిన అన్ని అంశాలను తాను రుజువు చేస్తానన్నారు.

Telangana: బావ బామ్మర్దుల తీరు ఈస్టమన్ కలర్ లాగా ఉంది

హైదరాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయడంతోపాటు జీవో 29 రద్దు చేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అలాంటి వేళ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అగ్రనేతల మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎక్సైజ్ శాఖా మంత్రి జూప్లలి కృష్ణారావు శనివారం గాంధీ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై వ్యంగ్య బాణాలు సంధించారు.

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం


అందులోభాగంగా హరీశ్‌రావుకు జూపల్లి బంపర్ ఆఫర్ ఇచ్చారు. హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వస్తానని సవాల్ చేస్తున్నాడన్నారు. అయితే హరీశ్ రావు సవాల్‌ని తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. హారీశ్‌రావు సవాల్‌కు సీఎం రేవంత్ రావాల్సిన అవసరం లేదన్నారు. తాను ఈ చర్చకు వస్తానని ఆయన పేర్కొన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ఆదాయం ఎంత? అవినీతి ఎంత? నాడు అప్పు ఎంత? ఎవరెవరు ఎంత దోచుకున్నారో అంతా చర్చిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజలు చూసే విధంగా ఈ అంశంపై చర్చిద్దామని బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మీ అవినీతి, అక్రమాలు, దోపిడికి సంబంధించిన అన్ని అంశాలను తాను రుజువు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.


ఇక సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలోని పార్టీ పెద్దలకు కప్పం కడుతున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.. మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందని జూపల్లి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కాకుండా.. హరీశ్ రావు మంత్రి అయి డ్యాన్స్ వేశాడని గుర్తు చేశారు.


హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మూసి రివర్ ఫ్రంట్‌లో యాభై వేల కోట్ల దోపిడి జరిగిందంటూ తెలంగాణ ప్రజలను కేటీఆర్, హరీశ్ రావులు తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌రావులు.. తాము నీతి మంతులమని అంటున్నారని గుర్తు చేశారు. బావ బామ్మర్ధుల తీరు ఈస్టమన్ కలర్‌లాగా ఉందంటూ జూపల్లి వ్యంగ్యంగా పేర్కొన్నారు. తెలంగాణ‌ను మొత్తం దోచుకుంది వాళ్లేనంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


కానీ బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా దివాళా తీశారని.. దాంతో వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చడానికి హరీశ్ రావు, కేటీఆర్‌లు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.


పది నెలలు అయినా ఇంకా ఓటమిని వాళ్ళు అంగీకరించినట్లు ఎక్కడ కనపడట్లేదంటూ కేటీఆర్, హరీశ్ రావు వ్యవహారశైలిపై జూపల్లి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మూసి ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్‌గా పేర్కొంటూ జీవో నెం.7 జారీ చేసిందని చెప్పారు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్‌లో తన ఇల్లు సైతం ఉందని.. అది పోతుందని జూపల్లి పేర్కొన్నారు.


గతంలో హైదరాబాద్‌ను డల్లాస్, లండన్, ఇస్తాంబుల్ చేస్తానంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే హుస్సేన్ సాగర్‌లో నీళ్లను.. కొబ్బరి నీళ్లు తాగేటట్లు చేస్తా చెప్పారన్నారు. ఆ క్రమంలో హైదరాబాద్‌ను మార్చాలన్న కేసీఆర్ మాటలను తాము స్వాగతిస్తున్నామన్నారు. ఏదీ ఏమైనా మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం అభివృద్ధి కావాల్సిందేనని.. అలాగే మురికి కూపం నుంచి పేదలకు విముక్తి కలిపించాల్సిందేనని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

For Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 02:41 PM