Kadiyam Srihari: బడ్జెట్ చర్చపై ప్రభుత్వం సీరియస్‌గా లేదు
ABN , Publish Date - Feb 14 , 2024 | 11:56 AM
తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీనికి 18 మండి సభ్యులం ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మందే ఉన్నారని.. లెక్కించండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హుకుం జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీనికి 18 మండి సభ్యులం ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మందే ఉన్నారని.. లెక్కించండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ తరుఫున బడ్జెట్‌లో కడియం శ్రీహరి చర్చలో పాల్గొన్నారు. బడ్జెట్‌పై ఎవరు రిప్లై ఇస్తారని కడియం ప్రశ్నించారు.
కొన్ని కారణాల వల్ల ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క సభకు హాజరు కాలేదని.. బడ్జెట్‌పై రిప్లై సమయానికి వస్తారని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. బడ్జెట్ చర్చపై ప్రభుత్వం సీరియస్‌గా లేదని అర్థమవుతోందని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఇందిరమ్మ పాలన అనే అంటుందని.. ఆమె పాలనలో ఎమర్జెన్సీ ఎవరూ మర్చిపోలేరన్నారు. అంతకంటే నిర్బంధాలు ఏమీ ఉండవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీదే కుటుంబ పాలన.. ఒక్క కుటుంబానికే నేతలంతా సేవ చేస్తున్నారని కడియం విమర్శించారు. మీరు కుటుంబం కోసం పనిచేస్తూ మాది కుటుంబపాలన అని ఎట్లా అంటారని ప్రశ్నించారు. ఇవాళ ఎజెండా అది కాదు బడ్జెట్ మీద మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.