Share News

Kaleshwaram Commission: కాళేశ్వరంపై కీలక విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఐఏఎస్

ABN , Publish Date - Dec 18 , 2024 | 03:31 PM

Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ దఫా విచారణలో కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లను కమిషన్ విచారించనుంది. ఈరోజు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది.

Kaleshwaram Commission:  కాళేశ్వరంపై కీలక విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఐఏఎస్
Kaleshwaram Commission

హైదరాబాద్, డిసెంబర్ 18: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ విచారణ (Kaleshwaram Commission) కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లతో ప్రస్తుత ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారించనుంది. అందులో భాగంగా ఈరోజు పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్‌ ముందు హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్‌కే జోషి, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది. ఈ కమిషన్‌ విచారణ వాడీవేడీగా జరిగింది.

CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు


ఓపెన్ కోర్టు నిర్వహించిన కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ మొదట రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా.. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందని జోషి తెలిపారు. ప్రాజెక్ట్ స్థలాన్ని ఎవరు మార్చారని కమిషన్‌ మరో ప్రశ్న వేయగా.. నాటి సీఎం కేసీఆర్, మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జోషి సమాధానం ఇచ్చారు. దీని పై ఏదైనా కేబినెట్ సబ్ కమిటీ వేశారా అని కమిషన్ అడుగగా.. కేబినెట్ సబ్ కమిటీ ఏమీ లేదని జోషి చెప్పారు.


కమిషన్ ప్రశ్న... ఎస్కే జోషీ సమాధానాలు

కమిషన్: మేడిగడ్డ ప్రాజెక్ట్ సీఎం నిర్ణయమేనా?

జోషి: ప్రభుత్వ నిర్ణయమే.

కమిషన్: ప్రభుత్వం అంటే ఎవరు?

జోషి: సీఎం, మంత్రులు

కమిషన్: సీఎం నిర్ణయమే ఫైనలా?

జోషి: అవును.

కమిషన్: ప్రాజెక్టుకు బడ్జెట్ ఉందా లేదా సప్లిమెంటరీ బడ్జెట్ ఇచ్చారా?

జోషి: వార్షిక బడ్జెట్‌ మాత్రమే ఉంటుంది.. అవసరాన్ని బట్టి సప్లిమెంట్ బడ్జెట్ ఉంటుంది.

కమిషన్: బ్యారేజీ నిర్మాణ సంస్థలు ఇతర ఏజెన్సీల సాయమేమైనా తీసుకున్నాయా?

జోషి: కాంట్రాక్ట్ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల (సబ్ కాంట్రాక్ట్) సాయం తీసుకొని ఉండొచ్చు.

కమిషన్: మేడిగడ్డ పిల్లర్స్‌ కుంగుబాటుకు కారణం ఏంటి?

జోషి: డిజైన్ల లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం, గేట్ల ఆపరేషన్‌ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చు.

కమిషన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు?

ఫండ్స్ కోసమని.. పబ్లిక్ బాండ్స్ ఇష్యూ చేయలేదని సమాధానం ఇచ్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని ఎస్‌కే జోషి వెల్లడించారు.


హైపవర్ కమిటీ గురించి కమిషన్ ప్రశ్నించగా.. దాని గురించి తెలియదని జోషి మొదట సమాధానం ఇచ్చారు. అయితే కమిషన్ జీవో చూపించడంతో ఆయన అవునని ఒప్పుకున్నారు. అది టెక్నికల్ కమిటీ మాత్రమేనని వెల్లడించారు. మహారాష్ట్ర వైపు ముంపు ఎక్కువ ఉండడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కట్టారని తెలిపారు. కాళేశ్వరం కాంప్లెక్స్ ప్రాజెక్ట్.. 28 ప్యాకేజీలు.. 8 లింకులతో కట్టారన్నారు. ఒక్కసారే అప్రూవల్ లేదని.. వివిధ సమయాల్లో ఆయా ప్యాకేజీలకు దాదాపు 200 అనుమతులు ఇచ్చి ఉంటారని జోషి చెప్పారు.


కాగా.. ఈరోజు నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ దఫా వారం రోజుల పాటు కమిషన్ విచారించనుంది. ఈసారి కమిషన్ ముందుకు కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులు హాజరుకానున్నారు. కీలక సోమేశ్ కుమార్, స్మిత సభర్వాల్ తదితరులు కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ

TG Assembly: అసెంబ్లీలో భూభారతి 2024 బిల్లు.. ప్రతిపక్షాల అభ్యంతరం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 04:03 PM