Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

KCR: అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 03 , 2024 | 07:58 PM

బీఆర్ఎస్‌(BRS)కు గెలుపు, ఓటములు కొత్త కాదని.. ఈ ఓటమితో కుంగి పోయేది, పొంగి పోయేది ఏమీ లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదన్నారు. ప్రజలంతా ఎమ్మెల్యే ఓడిపోవాలని, కేసీఆర్ మాత్రం గెలవాలని అనుకున్నారని.. అందుకే మనకు మొదటికే మోసం వచ్చిందని చెప్పారు.

KCR: అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్‌(BRS)కు గెలుపు, ఓటములు కొత్త కాదని.. ఈ ఓటమితో కుంగి పోయేది, పొంగి పోయేది ఏమీ లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదన్నారు. ప్రజలంతా ఎమ్మెల్యే ఓడిపోవాలని, కేసీఆర్ మాత్రం గెలవాలని అనుకున్నారని.. అందుకే మనకు మొదటికే మోసం వచ్చిందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై కరీంనగర్, పెద్దపల్లి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ... ఉద్యమకాలం నుంచి తమకు సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. రైతులు రోడ్లు ఎక్కుతారని చెప్పారు. బీఆర్ఎస్‌తోనే మేలు జరుగుతుందన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైందని అన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలను నేతలు పట్టించుకోవద్దని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.

కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ

సభ తర్వాత బస్సు యాత్ర చేద్దామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు. వచ్చే వారం కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఆ తర్వాత బస్సు యాత్రలు చేద్దామని వివరించారు. మండల స్థాయిలో నేతలు పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని అన్నారు. ఎల్ఆర్ఎస్‌ను గతంలో ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నామని కాంగ్రెస్ నేతలు పెద్ద రాద్దాంతం చేశారని మండిపడ్డారు. అదే ఎల్‌ఆర్ఎస్‌ను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రకటించిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య గొడవలు ఉన్నాయని.. వాళ్ల కుంపటి వాళ్లు సర్దుకోవడానికి టైం సరిపోతుందని చెప్పారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2024 | 08:22 PM