Hyderabad: జూ కీపర్‌పై సింహం దాడి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:53 PM
Hyderabad Zoo Park: హైదరాబాద్ జూ పార్క్‌లో ఎనిమిల్ కీపర్‌పై సింహం దాడి చేసింది. ఈ దాడిలో కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో ఉడంగడ్డకు చెందిన హుస్సేన్(40) ఎనిమల్ కీపర్‌గా పని చేస్తున్నాడు.
Hyderabad Zoo Park: హైదరాబాద్ జూ పార్క్‌లో ఎనిమిల్ కీపర్‌పై సింహం దాడి చేసింది. ఈ దాడిలో కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో ఉడంగడ్డకు చెందిన హుస్సేన్(40) ఎనిమల్ కీపర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే.. హుస్సేన్ సమ్మర్ హౌస్‌లో ఉన్న సింహాలు ఉండే ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లాడు. ఆడ సింహం (శిరీష) ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లాడు. ఆ సింహాన్ని పక్కనున్న మరో ఎన్‌క్లోజర్‌లోకి పంపించాడు. అయితే, ఆ ఎన్ క్లోజర్‌ను లాక్ చేయడం మర్చిపోయిన హుస్సేన్.. తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ఇంతలో పక్కనున్న ఎన్ క్లోజర్ నుంచి సింహం అతనివైపు దూసుకొచ్చింది. అతనిపై దాడి చేసింది. సింహం పంజా దెబ్బకు హుస్సేన్ కొంత దూరంలో పడిపోయాడు.
భయపడిపోయిన హుస్సేన్ ఎన్ క్లోజర్ గేట్ బోల్ట్ పెట్టకుండా బయటికి పరుగులు తీశాడు. దీంతో ఆ ఆడ సింహం కూడా ఎన్ క్లోజర్ నుంచి బయటికి వచ్చింది. సమాచారం అందుకున్న జూ అధికారులు, వెటర్నరీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన వెటర్నరీ సిబ్బంది.. డాట్ పద్దతి ద్వారా ఆడ సింహం శిరీషకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం ఆ సింహాన్ని ఎన్ క్లోజర్‌లోకి వదిలేశారు. గాయపడిన ఎనిమల్ కీపర్ హుస్సేన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ చేతులకు గాయాలు అయ్యాయి. ఇదిలాఉంటే.. జూ పార్క్‌లోనే పని చేస్తున్న అసిస్టెంట్ ఎనిమల్ కీపర్ ఫర్మాన్ ఇటీవల పాము కాటుకు గురయ్యారు. అతను కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఇతని పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు.