Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
ABN , Publish Date - Jan 10 , 2024 | 09:48 PM
ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ( Congress ) కోఆర్డినేటర్లు గురువారం (రేపు) వెళ్లనున్నారు. రెండ్రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు నియమించారు.
ఢిల్లీ : ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ( Congress ) కోఆర్డినేటర్లు గురువారం (రేపు) వెళ్లనున్నారు. రెండ్రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు నియమించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి శ్రీనివాసరెడ్డికి రెండేసి లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. రేపటి సమావేశానికి తెలంగాణ నుంచి పలువురు సమన్వయకర్తలు హాజరుకానున్నారు. సమన్వయకర్తగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరుపై ఇంకా స్పష్టత రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 25 మంది సమన్వయకర్తలకు 22 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు సహా మరో ఇద్దరు హాజరుకాలేకపోతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నది. కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. మిత్రపక్షాల అభ్యర్థి ఉన్నచోట పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం సహకరించేలా హైకమాండ్ ప్రణాళికలు చేస్తోంది.