Share News

Dana Kishore: శుభవార్త.. హైదరాబాద్ వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 09:09 PM

నగరంలో భారీ వర్షాలకు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic Problems) తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ(MAUD Principal Secretary) దాన కిషోర్(Dana Kishore).. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాలను పరిశీలించారు.

Dana Kishore: శుభవార్త.. హైదరాబాద్ వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..
MAUD Principal Secretary Dana Kishore

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలకు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు (Traffic Problems) తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (MAUD Principal Secretary) దాన కిషోర్(Dana Kishore).. ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీసు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక మెుత్తం నీరు నిల్వ ఉండి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు దాన కిషోర్ వెల్లడించారు.


అలాగే నగరంలో గుర్తించిన 140నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సైతం సంపులు నిర్మించేందుకు స్థలాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌కు దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో రూ.20కోట్లతో మొత్తం 11ప్రాంతాల్లో 10లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. వర్షం కురిసే సమయంలో సంపుల్లోకి నీటిని సేకరించి.. అనంతరం సమీపంలో ఉన్న నాలాల్లోకి పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Actress Lavanya: నా రాజ్ తరుణ్ నాకు కావాలి: నటి లావణ్య

Praneeth Hanumanthu: తండ్రీకుమార్తె బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ అరెస్టు..

Crime News: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమికే ఎసరు.. ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి..

Updated Date - Jul 10 , 2024 | 09:14 PM