Hyderabad: ఆ విషయంలో పత్రికలు, మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరిగింది: జలమండలి అధికారులు..
ABN , Publish Date - Dec 20 , 2024 | 09:22 PM
బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు చోట్ల 2.20 ఎకరాల తమకు భూమి ఉందని జలమండలి అధికారులు తెలిపారు. ఒక దగ్గర ఎకరా భూమి ఉందని, అక్కడ జలమండలికి చెందిన ఓ రిజర్వాయర్ ఉన్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నం.2, 10, 14 ప్రాంతాల ప్రజలకు ఇదే రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 10లో జలమండలి (Water Board)కి చెందిన 2.20 ఎకరాల భూమి కబ్జా (Land Grabbing)కు గురైందని వివిధ మాధ్యమాల్లో ప్రచారమైన విషయం అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. వివిధ పత్రికలు, మాధ్యమాల్లో జరిగిన ప్రచారం నేపథ్యంలో జలమండలితోపాటు రెవెన్యూ, హైడ్రా, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. భూమి ఎటువంటి కబ్జాకు గురి కాలేదని తనిఖీల్లో అధికారులు తేల్చారు. ఈ మేరకు 2.20 ఎకరాలకు సంబంధించిన భూమిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.
Hyderabad: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. భారీగా నగదు సీజ్..
బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు చోట్ల 2.20 ఎకరాల తమకు భూమి ఉందని జలమండలి అధికారులు తెలిపారు. ఒక దగ్గర ఎకరా భూమి ఉందని, అక్కడ జలమండలికి చెందిన ఓ రిజర్వాయర్ ఉన్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నం.2, 10, 14 ప్రాంతాల ప్రజలకు ఇదే రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి 150 మీటర్ల దూరంలో మరో 1.20 ఎకరాలు ఉందని తెలిపారు. అయితే ఇది రాళ్లతో కూడిన ఖాళీ స్థలం కావడంతో రెవెన్యూ అధికారుల చేత సర్వే నిర్వహించి స్పష్టమైన సరిహద్దులు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ స్థలంపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ సైతం ఉన్నట్లు వివరించారు.
TG highcourt: కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ...
హైకోర్టు ఆదేశాల మేరకే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అధికారులు స్పష్టం చేశారు. తనిఖీల్లో భూమి కబ్జాకు గురి కాలేదని నిర్ధరించినట్లు వెల్లడించారు. దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రచారం అవాస్తవమని ప్రకటించారు. ఈ కబ్జా అంశంపై హైకోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేస్తామని జలమండలి అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
E-Race Case: ఈ-రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌ను వదిలేలా లేరుగా..
Harish Rao: హమీలు అమలు చేయలేకే రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు: హరీశ్ రావు..