Share News

Minister Ponguleti : అభయహస్తం ఎంట్రీ తర్వాత ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్‌ చేస్తాం

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:03 PM

అభయహస్తం దరఖాస్తులు ఎంట్రీ తర్వాత ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్‌ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సచివాలయంలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Minister Ponguleti : అభయహస్తం ఎంట్రీ తర్వాత ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్‌ చేస్తాం

హైదరాబాద్: అభయహస్తం దరఖాస్తులు ఎంట్రీ తర్వాత ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్‌ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సచివాలయంలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తాం. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటే చేస్తాం. భట్టి విక్రమార్క చైర్మన్‌గా కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు అవుతుంది. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, నేను ఉన్నా. ఇప్పటివరకు కోటీ 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. భూ సమస్యలు, రేషన్‌ కార్డుల కోసం 20 లక్షలు దరఖాస్తులు గ్యారంటీలను అప్పుడే అమలు చేయాలని ప్రతిపక్షాలు నిలదీయడం సరికాదు. గ్యారెంటీలను 40 రోజుల్లో అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. 100 రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2024 | 10:03 PM