Ponnam Prabhakar: ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయన్న విమర్శలపై మంత్రి పొన్నం రియాక్షన్
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:22 PM
Telangana: ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దరఖాస్తులు రోడ్డుపాలైన విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్‌ను మంత్రి వివరణ కోరారు.
హైదరాబాద్, జవవరి 9: ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దరఖాస్తులు రోడ్డుపాలైన విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్‌ను మంత్రి వివరణ కోరారు. దీనిపై మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగం పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలన్నారు.
బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖలలో దొడ్డి దారిన ఉద్యోగులంతా వెళ్లిపోవాలన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి విచారణ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు. అన్ని శాఖల్లో విచారణ జరగాలని తెలిపారు. ఎంపీ సంతోష్ చెల్లి కూడా భూనిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నారని.. అలాంటి వారు కూడా భూమి ఇచ్చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...