Share News

Telangana: ఆడబిడ్డలనే అంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:33 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Telangana CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలనే అంటవా? వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి.

Telangana: ఆడబిడ్డలనే అంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..
MLA KTR

హైదరాబాద్, జులై 31: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Telangana CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలనే అంటవా? వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి. బుధవారం అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలైనా సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ దుమారం రేపుతున్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కేటీఆర్.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.


కేటీఆర్ కామెంట్స్..

‘మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితక్కకు, సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం. ఈ ముఖ్యమంత్రి అన్‌ఫిట్ ముఖ్యమంత్రి. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు. కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులిద్ది.’ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.


నీలాంటి వారు కాదు..

‘మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి.. ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ మాదిరిగా పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కాదు. సీఎం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని.. బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి విక్రమార్కా! పదేళ్లు అధికారంలో ఉన్నా ఏరోజైనా ఆడబిడ్డలను అవమానించామా? ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడామని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం. ఈరోజు మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని సంస్కరించుకో. ఇకనైనా ముఖ్యమంత్రి సమయం ఎంతో వివరించకుంటే ఊరుకునేది లేదు. ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read:

ఈవెంట్‌లో ముద్దు.. చిక్కుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు

బీఆర్‌ఎస్ నిరసనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం

ఏపీలో బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించిన ప్రభుత్వం

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 31 , 2024 | 05:33 PM