Share News

Congress: ప్రజలు చిత్తుగా ఓడించినా బాల్క సుమన్‌కు బుద్ది రాలేదు: ఎమ్మెల్యే వివేక్

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:16 PM

మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా సుమన్‌కు బుద్ది లేదన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ...

Congress: ప్రజలు చిత్తుగా ఓడించినా బాల్క సుమన్‌కు బుద్ది రాలేదు: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చిత్తుగా ఓడించినా సుమన్‌కు బుద్ది లేదన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఈ తిట్లకు సృష్టి కర్త కేసీఆర్ అని, అధికారం తల కెక్కి అందర్నీ ఇష్టమొచ్చినట్టు కేసీఆర్ తిట్టారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మార్పు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు భవిష్యత్ లేదని, ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యానించారు.

బాల్క సుమన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..

రండ పనులు చేసింది మీరు.. అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. రేవంత్‌ను ఉద్దేశించి ప్రచురించలేని భాషలో దుర్భాషలాడారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరుష పదజాలంతో దూషించారు. చెత్త సీఎం రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపిస్తూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. మంచిర్యాల, పెద్దపల్లిలో ఆయన మాట్లాడారు. ‘‘కాలం కలిసొచ్చి అందలమెక్కావ్‌... నీ అదృష్టమో, తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నవ్‌. గతంలో చిల్లర మాటలు మాట్లాడిన నువ్వు.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో పద్ధతిగా మాట్లాడాలె. పదేళ్ల పాటు తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్‌ను తిడితే ఊరుకోం.. చెప్పుదీసి కొడుతా.. ఖబడ్దార్‌’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎప్పుడు ఎవడు కుర్చీ లాగుతాడో, ఎవరు అంగీ లాగు లాగుతాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. అదానీని రాహుల్‌ గాంధీ విమర్శిస్తే, రేవంత్‌ రెడ్డి దావోస్‌ వెళ్లి రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు వేయని ప్రభుత్వం.. కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం చెల్లిందచిందని మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సైతం పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించారన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 01:16 PM