Jani Master: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
ABN , Publish Date - Sep 20 , 2024 | 04:38 PM
Jani Master Remand Report: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో నార్సింగి పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. జానీ మాస్టర్ దురుద్దేశంతోనే యువతిని తన అసిస్టెంట్‌గా పెట్టుకున్నట్లు తేల్చారు. అంతేకాదు.. ముంబైలోని ఓ హోటల్‌లో..
Jani Master: జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన వివరాలను పేర్కొన్నారు. తాను చేసిన నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు. 2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు తెలిపారు.
రిమాండ్ రిపోర్ట్‌లో నార్సింగి పోలీసులు పేర్కొన్న వివరాలు..
జానీ మాస్టర్ నేరాన్ని అగికరించారు.
2019లో జానీ మాస్టర్‌తో బాధితురాలు పరిచయమైంది.
దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేరుకున్నాడు.
ముంబైలో ఓ హుటల్ బాధితురాలిపై 2020లో జానీమాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తోలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయస్సు 16 ఏళ్లు.
గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బాధితురాలిపై జానీ మాస్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
తన పలుకుబడి ఉపమోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు.
జానీ మాస్టర్ బార్య కూడా బాధితురాలిని బెదిరించింది.