Share News

Ganesh Immersion: ఇంకా పూర్తికాని వినాయక నిమజ్జనాలు.. పెద్ద సంఖ్యలో నిలిచిన వాహనాలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 01:28 PM

Telangana: ట్యాంక్‌బండ్‌పై రెండో రోజు మధ్యాహ్నానికి కూడా వినాయకుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై గణనాథులు బారులు తీరాయి. ఇప్పటికే సాధారణ వాహనాలకు పోలీసులు అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ మార్గ్‌పై వినాయక వాహనాలు నిలిచిపోయాయి. ఇంకా క్యూలోనే వాహనాలు వేచి చూస్తున్న పరిస్థితి.

Ganesh Immersion: ఇంకా పూర్తికాని వినాయక నిమజ్జనాలు.. పెద్ద సంఖ్యలో నిలిచిన వాహనాలు
Ganesh immersion

హైదరాబాద్, సెప్టెంబర్ 18: పదకొండు రోజుల పాటు పూజలందుకున్న విజ్ఞేశ్వరుడు నిమజ్జనానికి (Ganesh Immersion) వేచి చూస్తున్నాడు. ట్యాంక్‌బండ్‌పై రెండో రోజు మధ్యాహ్నానికి కూడా వినాయకుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై (Tank Bund) గణనాథులు బారులు తీరాయి. ఇప్పటికే సాధారణ వాహనాలకు పోలీసులు అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ మార్గ్‌పై వినాయక వాహనాలు నిలిచిపోయాయి.

Sharmila: రాహుల్‌కు బేషరుతుగా క్షమాపణ చెప్పాల్సిందే.. షర్మిల డిమాండ్


ఇంకా క్యూలోనే వాహనాలు వేచి చూస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం లోపు పూర్తి అవుతాయని పోలీసులు చెప్పినప్పటికీ నిమజ్జనాలు ఇంకా పూర్తికాలేదు. క్రేన్ల వద్ద ఆగి ఉన్న వినాయకుల నిమజ్జనానికి ఆలస్యం అవుతున్నాయి. టెక్నికల్ ఇష్యూస్‌తో కొన్ని క్రేన్లు మొరాయించాయి. ఈరోజు సాయంత్రం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4, 5, 6 దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..


సీపీ విజ్ఞప్తి...

గణేష్ నిమజ్జనాలు ఆలస్యం అవుతుండటంతో స్వయంగా సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) రంగంలోకి దిగారు. గణనాథులను నిమజ్జనాలకు త్వరతిగతిన తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఓ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇస్తోందని.. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందన్నారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతోపాటు... సామాన్య జనులకు కూడా ఇబ్బంది అవుతోందన్నారు. వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలని కోరారు. 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలిరావాలని కోరుతున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..

Sharmila: రాహుల్‌కు బేషరుతుగా క్షమాపణ చెప్పాల్సిందే.. షర్మిల డిమాండ్

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 03:57 PM