TG News: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా లోగో
ABN , Publish Date - May 28 , 2024 | 09:35 PM
తెలంగాణ కొత్త చిహ్నం రూపొందించడంలో రూపకర్త రుద్ర రాజేశం అండ్ కో బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిహ్నాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. అందులో ఒకదానిని సెలక్ట్ చేశారని తెలిసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరిసేలా 40కి డిజైన్లు రూపొందించామని.. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి అవుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి రుద్ర రాజేశం వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ కొత్త చిహ్నం రూపొందించడంలో రూపకర్త రుద్ర రాజేశం అండ్ కో బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిహ్నాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు. అందులో ఒకదానిని సెలక్ట్ చేశారని తెలిసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరిసేలా 40కి డిజైన్లు రూపొందించామని.. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి అవుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి రుద్ర రాజేశం వెల్లడించారు.
‘అమరుల త్యాగాలు ఎత్తిపట్టేలా తెలంగాణ చిహ్నం ఉంటుంది. తెలంగాణ కోసం బిడ్డలు ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగాలు ఉట్టిపడేలా చిహ్నం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా లోగో ఉంటుంది. లోగో ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడే చెప్పను. తెలంగాణ చిహ్నం చూశాక ప్రజలు తప్పకుండా సంతోషిస్తారు. కళ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన ఉంది. ఆయన ఢిల్లీలో ఉంటూ చిహ్నం ఎలా ఉండాలో గైడ్ చేస్తున్నారు. లోగో కోసం 40కి పైగా డిజైన్లు చేశా. ఈ రోజు రాత్రి లేదా రేపటి లోగా లోగో పూర్తి అవుతుంది. లోగో పూర్తి అయ్యాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపిస్తా’ అని రుద్ర రాజేశం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. సీఎం ఖరారు చేసిన తర్వాత మీడియాకు తెలియజేస్తామని ప్రకటించారు.
For More Telangana News and Telugu News..