Share News

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Nov 16 , 2024 | 10:24 AM

Telangana: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో బాంబు పెట్టారంటూ కాల్ రావడంతో అధికారులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో బాంబు ఉందంటూ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్.. ఏం జరిగిందంటే
Shamshabad Airport

హైదరాబాద్, నవంబర్ 16: విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బ్యాంకాక్‌కు విమానం బయలుదేరింది. అయితే విమానం బయలుదేరిన కాసేపటికే ఓ కాల్ కాలవడంతో ఎమర్జెన్సీగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో ప్రయాణికులను దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇది ఫేక్‌ కాల్‌గా అధికారులు తేల్చారు.

TG News: ఓ ఇంట్లో నుంచి పెద్దఎత్తున శబ్ధం.. అపార్ట్‌మెంట్ వాసులు అలర్ట్.. ఏం జరిగిందంటే


శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో బాంబు పెట్టారంటూ కాల్ రావడంతో అధికారులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో బాంబు ఉందంటూ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు మిగిలిన అధికారులు పూర్తిస్థాయిలో విమానాన్ని తనిఖీలు చేశారు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దాదాపు గంటకు పైగా అధికారులు విమానాన్ని పూర్తిస్థాయిలో సోదాలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి బాంబు లేదని.. ఆ కాల్ ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు. మరోవైపు ఓ ప్రయాణికుడు కూడా విమానంలో బాంబు పెట్టారని చెప్పడంతో అతడిని కూడా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


అయితే గత రెండు వారులుగా శంషాబాద్ విమానాశ్రయానికి ఐదోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా వరుసగా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే శంషాబాద్ విమానాశ్రయానికి దాదాపు ఐదు సార్లు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈరోజు కూడా బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. ప్రయాణికులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని చెబుతూ వారిని విమానంలో నుంచి దింపేసిన తర్వాత పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు. అయితే బాంబు లేకపోవడంతో పాటు ఫేక్‌ కాల్ అని అధికారులు గుర్తించారు. అలాగే కాల్ చేసిన వ్యక్తితో పాటు సదరు ప్రయాణికుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

YS Jagan: అయినా మారని జగన్.. మళ్లీ అవే అబద్ధాలు..

CM Chandrababu : దోచేసి.. దాచేసారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2024 | 10:34 AM