Share News

Congress: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..

ABN , Publish Date - Nov 10 , 2024 | 09:28 AM

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.

Congress: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.,) ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల (26 days) పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు (Public celebrations) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Govt.,) ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.


ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం సంవత్సర కాలంలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని విప్లవాత్మక, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 5 వందలకే గ్యాస్ సిలిండర్, 2 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై 26 రోజులపాటు చైతన్య పరిచేలా కార్యక్రమాలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలు చేసిందని, దాదాపు రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతోపాటు మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామని పేర్కొన్నారు.


మూతపడిన ములుగు జిల్లాలోని కమలాపూర్‌ రేయాన్స్‌ పరిశ్రమను రూ.4 వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామన్నామని భట్టి విక్రమార్క తెలిపారు. వీటిని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి ఈ నెల 14న రోజున ప్రారంభమయ్యే ఈ ‘ప్రజా విజయోత్సవాల’ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చివరి రోజైన డిసెంబరు 9న హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్‌ షోలు, క్రాకర్స్‌ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన గ్రూప్‌-4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తామని తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తారు.

కాగా 26 రోజుల వేడుకల్లో భాగంగా కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంటారు. స్సోర్ట్స్ యూనివర్శిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రస్పాన్స్ ఫోర్స్ ప్రారంభిస్తారు. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదన్శలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన పకడ్బంధి ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖ కార్యదర్శులను భట్టి విక్రమార్క ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..

లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత

బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

ఉన్మాదులను వదిలేయాలా..

తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 10 , 2024 | 09:28 AM