Share News

Ramoji Rao: రామోజీరావు అంత్యక్రియలు పూర్తి..

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:45 AM

రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రను ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తెలంగాణ పోలీసులు గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు పాల్గొన్నారు.

Ramoji Rao: రామోజీరావు అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత, మీడియా మెుఘల్ రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొడుకు కిరణ్ చేతులమీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రను ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు నిర్వహించారు. కార్యక్రమంలో సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి హాజరై రామోజీరావు పాడె మోశారు. తెలంగాణ పోలీసులు గౌరవవందనం చేశారు.


చంద్రబాబు, నారా లోకేశ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వరరావు, వి.హనుమంతరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము సహా పలువురు ప్రముఖులు పాల్గొన్ని కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీ గ్రూపుల సిబ్బందిని, లక్షలాది మంది శ్రేయోభిలాషులను శోకసద్రంలో నెట్టి ఆయన వెళ్లిపోయారు. తన అంత్యక్రియల స్థలాన్ని(స్మారక కట్టడం) ముందుగానే రామోజీరావు నిర్ణయించుకున్నారు. దాన్ని ఉద్యానవంగా తీర్చిదిద్దారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించాలని కుటుంబసభ్యులకు ముందుగానే ఆయన చెప్పారు.

Updated Date - Jun 09 , 2024 | 12:14 PM